MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం

Andhra News: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. 9,165 ఓట్ల తొలి ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు.

Continues below advertisement

MLC By Poll In Godavari Districts: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి (Borra Gopimurthy) విజయం సాధించారు. 9,165 మొదటి ప్రాధాన్యత ఓట్లతో సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. దీన్ని  కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడ జేఎన్టీయూలో సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే గోపీమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను పీడీఎఫ్ బలపరిచింది. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు గానూ 14,680 పోలయ్యాయి. వీటిలో 814 చెల్లని ఓట్లుగా ఎన్నికల అధికారులు గుర్తించారు.

Continues below advertisement

బొర్రా గోపీమూర్తి విజయంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం నుంచి సీపీఎస్‌ ఉద్యమంలో పాల్గొంటానని.. ఉపాధ్యాయుల సమస్యలను మండలిలో వినిపిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉపాధ్యాయులు ఓటేశారని.. తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Free Meal in Railway station : విమానం లాగా, రైలు ఆలస్యమైనా 'ఉచితంగా ఆహారం' - చాలామందికి ఈ విషయం తెలీదు

Continues below advertisement
Sponsored Links by Taboola