BJP On Child Murder :   సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ తనకల్లు గ్రామంలో ఇంతియాజ్ అనే వ్యక్తి కారణంగా ఆత్మహత్య చేసుకున్న మైనల్ బాలిక వ్యవహారంలో పోలీసులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కదిరి నియోజకవర్గానికి చెందిన ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఈ అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తనకల్లులో జరిగిన ఘటనను లవ్ జీహదీ కోణంలో విచారణ జరపాలని విష్ణువర్దన్  రెడ్డి సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో నిందితుడు అయిన ఇంతియాజ్ తో పాటు  ఇతర నిందితులు ఉన్నా...  ఆ కోణంలో ఎందుకు విచారం జరపడం లేదని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.  


లవ్ జీహాద్ కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు ? 


నిందితుడు ఇంతియాజన్‌ను జిల్లా బహిస్కరణ చేయాలని విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.  గతంలో ఇంతియాజ్ పై పలువురు పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.  మైనర్ బాలిక కేసులో FIR లో ఫోక్సో చట్టం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.  కేసు విషయం అధికార పార్టీ రాజకీయ కోణంలో  చూడవద్దని..  కేవలం ఒక పార్టీ పైన సంఘటన తోసివేసి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్  మైనర్ బాలిక ఆత్మహత్య సంఘటన జరిగే ఐదు రోజులవుతున్న బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు.  శాంతిభద్రతలు దిగజారాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. 


ఇంత నేరం జరిగినా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు తెరవడం లేదు ?


ఏపీలో ప్రతిపక్ష పార్టీలు కూడా తనకల్లులో మైనర్ బాలిక ఆత్మహత్యపై  నోరుమెదపడం లేదని మండిపడ్డారు.  పోలీస్ యంత్రాంగము నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపడం లేదని అసతృప్తి వ్యక్తం చేశారు.  మైనర్ బాలిక ఆత్మహత్య కేసుపై హోంమంత్రి , ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.  ఓక్క నిందితుడిపై  కేసు పెట్టి ఇతర నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ంలేదని ప్రశ్నించారు.  ప్రభుత్వం వెంటనే బాదిత కుటుంభాని న్యాయం చేయకుంటే నిందతుడి ఇంటిముందు బిజేపి బాదిత కుటుంబంతో కలసి ఆందోళన చేస్తామని విష్ణువర్దన్ రెడ్డి హెచ్చరించారు. 


బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే.. .. నిందితుడి ఇంటి ముందు ధర్నా


తనకల్లు గ్రామంలో ఓ పార్టీ తరపున యువత విభాగంలో చురుకుగా తిరిగే ఇంతియాజ్.. ప్రేమ పేరుతో ఓ బాలికను వంచించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో వీడియోలు వెలుగులోకి రావడంతో సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేసి అధికార పార్టీ నీరు గారుస్తోందన్నది బీజేపీ ప్రధాన అభియోగం. ఈ ఘటనలో లవ్ జీహాద్ కోణాన్ని కాదనలేమని విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేమైనా ఉందని ఇప్పటి వరకూ కనీసం అనుమానం కూడా వ్యక్తం చేయలేదు. . అందుకే ఈ కోణంలో దర్యాప్తు చేయాలని విష్ణువర్దన్ రెడ్డి పోలీసులను కోరారు.