Avinash Reddy reacted On Sharmila Comments :  కడప లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు.  మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తానని  అదే మంచిదన్నారు.  పులివెందుల‌లో  ప్రచార కార్యక్రమంలో మాట్లాారు.  తాను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు అమె విజ్ఞతకే వదిలేస్తున్నాన‌ని అన్నారు. ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉన్నాయ‌ని చెప్పారు. మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటార‌ని,. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటార‌ని ష‌ర్మిల‌ను ఉద్దేశించి అన్నారు. మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకోవ‌చ్చ‌ని, కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాల‌న్నారు. మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉంటుంది కదా అని అవినాష్‌రెడ్డి అన్నారు.                   


 





 
షర్మిలకు తెలివి ఉందో.. లేదో తెలియడం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పుట్టింటి వారిపై షర్మిల యుద్ధానికి సిద్ధం అంటోందని విమర్శించారు. ఆమె తెలంగాణలో పార్టీ పెడితే తాము మద్దతిచ్చామని తెలిపారు. కానీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీకి వచ్చిందని మండిపడ్డారు. యర్ర గంగిరెడ్డి.. సాక్షాలను తారుమారు చేస్తూ ఉంటే అవినాష్ చూస్తూ ఉండిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వివేకానంద రెడ్డి బావమరిది శివ ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ అక్కడికి వెళ్ళాడనీ.. వివేకాకు యర్ర గంగిరెడ్డి అత్యంత సన్నిహితుడని చెప్పారు. సన్నిహితుడు కాబట్టే రక్తపు మరకలు తుడిచే సమయంలో అవినాష్ అడ్డుకోలేకపోయాడని వివరించారు రవీంద్రనాథ్ రెడ్డి. వైఎస్ వివేకా హత్య ఆయన ప్రమేయం ఏమీ లేదని.. ఆయన చూస్తూ ఉన్నారని స్పష్టం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


 





 మరోవైపు షర్మిల , సునీత   ప్రతీ రోజూ వివేకా హత్య విషయంలో అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఇచ్చిన జగన్ ను కూడా ఓడించారని.. వైసీపీ పునాదులు రక్తంలో తడిచిపోయాయనని అంటున్నారు. ఇప్పుడు కఆ ఆరోపణలకు సైలెంట్ గా ఉండటం కన్నా.. ఎదురుదాడి చేయాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.