ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ బలమైన పోరాటం చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేనాని తాజాగా స్పందించారు. ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించినట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ పవన్ అభినందనలు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో అనే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని పవన్ అన్నారు. ఫలితాలపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉందన్న ఆయన.. రెండు, మూడు సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
Also Read : AP CM Jagan Comments : అబద్ధాన్ని నిజం చేసి.. ముఖ్యమంత్రిని దింపేయాలని చూస్తున్నారు
ఎన్నికల తుది ఫలితాలు
ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 5998 చోట్ల వైసీపీ, 826 చోట్ల టీడీపీ, 177 చోట్ల జనసేన, 28 చోట్ల బీజేపీ, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 515 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా 502 చోట్ల వైసీపీ, 6 చోట్ల టీడీపీ, 2 చోట్ల జనసేన, సీపీఎం, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
Also Read: Tollywood: మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం.. చర్చించే అంశాలేంటి?