Breaking News Live Telugu Updates: బాపట్ల జిల్లాలో గుళికల వాసనతో 16 మంది మహిళలకు అస్వస్థత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Dec 2022 03:17 PM
బాపట్ల జిల్లాలో గుళికల వాసనతో 16 మంది మహిళలకు అస్వస్థత

బాపట్ల జిల్లా పర్చూరు మండలం చిన్న నంది పాడు గ్రామంలో 16 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. మొక్కజొన్న పంట పొలంలో గుళికలు చల్లేందుకు వెళ్లిన చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామానికి చెందిన కూలీలు...గుళికల వాసనకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 16 మంది మహిళలు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇద్దరు చిన్నారుల వయస్సు 14 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వారికి  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. 

Taneti Vanitha: చంద్రబాబు రోడ్ షో విషాదంపై హోం మంత్రి తానేటి వనిత కామెంట్స్

  • కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత.

  • చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి తోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి.

  • 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు రాత్రి పూట, ఇరుకు సందుల్లో సభ పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించిన హోం మినిస్టర్.

  • ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఉన్నారని మండిపాటు

  • గోదావరి పుష్కరాల్లో కూడా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 29 మంది ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేసిన హోం మంత్రి.

  • చంద్రబాబుకు ఇదేం పబ్లిసిటీ పిచ్చి అని ప్రజలందరూ ఇదేమి ఖర్మ రా బాబు అని బాధపడుతున్నారని వ్యాఖ్య

  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుంటే తమ్ముళ్లు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చి మాట్లాడతానని చంద్రబాబు చెప్పడం వెనుక అర్థం ఏంటని ప్రశ్నించిన హోంమంత్రి.

  • సీఎం జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడిన హోంమంత్రి వనిత.

  • చంద్రబాబు ఎలాగైనా ప్రజల నుండి సానుభూతిని పొందాలని విశ్వప్రయత్నాలు

  • చంద్రబాబు చేస్తున్న ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి ఖర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారని వ్యాఖ్యలు

  • కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని తెలిపిన హోంమంత్రి వనిత

  • ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న హోం మినిస్టర్

Minister Harish Rao: కాగజ్‌నగర్‌ లో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరిష్ రావు ప్రారంభించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో కాగజ్‌నగర్‌ చేరుకున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ లకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జెడ్పి చైర్మన్ కోవలక్ష్మి, జిల్లా ఎస్పీ సురేష్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, అత్రం సక్కు, పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

Amit Shah CM Jagan Meet: అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సీఎం వైయస్‌ జగన్‌

  • ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన అంశాల సహా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వివరించిన సీఎం జగన్‌

  • తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా అమిత్‌షాకు విజ్ఞప్తి చేసిన సీఎం

AP Governor: నెల్లూరు జిల్లా తొక్కిసలాటలో 8 మంది మృతిపై గవర్నర్ దిగ్భ్రాంతి

నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి జరిగిన ఓ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెందడంతో పాటు పలువురు గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను గవర్నర్  హరిచందన్ ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కందుకూరు మృతులకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం - సీఎం జగన్ ప్రకటన

కందుకూరు ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మరణించివారికి రూ.2 లక్షల చొప్పున , గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామని అన్నారు.

Minister KTR Uncle Death: సీఎం కేసీఆర్ వియ్యంకుడు కన్నుమూత

తెలంగాణ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామయ్య (భార్య తండ్రి) పాకాల హరినాథరావు మరణించారు. గుండెపోటుతో బుధవారం రాత్రి చనిపోయారు. కుటుంబసభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఆరోగ్యం మరింత విషమించడంతో అదే రోజు రాత్రి 8.30 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హరినాథరావు మృతితో మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. హరినాథరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హరినాథరావు పార్ధివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi: కందుకూరు రోడ్‌ షో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - పరిహారం ప్రకటన

ఏపీలో టీడీపీ రోడ్ షోలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి చెందారు. చనిపోయిన వారికి పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి 50 వేల పరిహారం ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

Background

ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం వాతావరణ విభాగం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. డిసెంబరు 26 మాల్దీవులు, దానిని ఆనుకొని ఉన్న కొమోరిన్ ప్రాంతం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం బలహీనపడిందని తెలిపారు. ఏదైమైనప్పటికీ, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతం మీద సగటు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో నిన్నటి వరకూ (డిసెంబరు 28) స్వల్పంగా వర్షాలు పడ్డాయి.


ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. 


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.


పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణ వాతావరణం


తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ‘‘హైదరాబాద్ లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు ట్వీట్ చేశారు. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33.2 డిగ్రీలు, 21.0 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.