Breaking News Live Telugu Updates: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘన స్వాగతం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Jul 2022 04:04 PM
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘనస్వాగతం

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు  తదితరులు ఘనస్వాగతం పలికారు. గిరిజన నృత్యాలు తో బిజెపి శ్రేణులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.

గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తిన గోదావరి వరద

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి వరద గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తింది. నదీ పరీవాహాక ప్రాంతాల్లోకురుస్తున్న వర్షాలతో అధికంగా వరదనీరొచ్చి చేరడంతో గోదావరికి వరద పోటెత్తింది. 


కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గౌతమీ గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రధాన స్నానఘట్టాల మెట్లను ముంచెత్తింది. స్నానఘట్టాలపై ఉన్న శివలింగం, నంది విగ్రహాలు మునిగిపోయాయి. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యగా ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్టు గోదావరి కుడిగట్ట అధికారులు సిద్ధంగా ఉన్నారు.


కొవ్వూరు, పక్కిలంక, పోలవరం ఫ్లడ్‌స్టోర్‌లలో ఇసుక, వెదురుకర్రలు, సర్వేబోదులు సిద్ధం చేశామన్నారు. అఖండ గోదావరి కుడిగట్టు పరిధిలోని ఏటిగట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాదికారులకు నివేదిక అందజేస్తున్నామన్నారు. కాగా వరద గోదావరిని చూడడానికి జనం గోష్పాదక్షేత్రానికి చేరుకుంటున్నారు.

గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తిన గోదావరి వరద

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో గోదావరి వరద గోష్పాద క్షేత్రాన్ని ముంచెత్తింది. నదీ పరీవాహాక ప్రాంతాల్లోకురుస్తున్న వర్షాలతో అధికంగా వరదనీరొచ్చి చేరడంతో గోదావరికి వరద పోటెత్తింది. 


కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద అఖండ గౌతమీ గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి ప్రధాన స్నానఘట్టాల మెట్లను ముంచెత్తింది. స్నానఘట్టాలపై ఉన్న శివలింగం, నంది విగ్రహాలు మునిగిపోయాయి. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యగా ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్టు గోదావరి కుడిగట్ట అధికారులు సిద్ధంగా ఉన్నారు.


కొవ్వూరు, పక్కిలంక, పోలవరం ఫ్లడ్‌స్టోర్‌లలో ఇసుక, వెదురుకర్రలు, సర్వేబోదులు సిద్ధం చేశామన్నారు. అఖండ గోదావరి కుడిగట్టు పరిధిలోని ఏటిగట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాదికారులకు నివేదిక అందజేస్తున్నామన్నారు. కాగా వరద గోదావరిని చూడడానికి జనం గోష్పాదక్షేత్రానికి చేరుకుంటున్నారు.

Kamareddy: కామారెడ్డిలో విషాదం, కరెంట్ షాక్‌తో నలుగురు దుర్మరణం

కొద్ది రోజులుగా ఆగకుండా వర్షాలు కురుస్తున్న వేళ కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి నలుగురు చనిపోయారు. స్థానిక బీడీ వర్కర్స్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారిని హైమద్, పర్వీన్, మాహిమ్, అద్నాన్ గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉండగా, వీరి డెడ్ బాడీస్‌ను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

AP High Court News: ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శికి నాన్‍బెయిలబుల్ వారెంట్

ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణకు నాన్‍బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఏపీ హైకోర్టు - విద్యాశాఖ బిల్లుల చెల్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ - హాజరైన ఆర్థికశాఖ అధికారులు రావత్, రాజశేఖర్, సురేష్‍కుమార్ - విచారణకు గైర్హాజరైన సత్యనారాయణ - విద్యాశాఖ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అంబటి సుధాకర్‍రావు - గైర్హాజరైన సత్యనారాయణకు నాన్‍బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్

AP Capital Issue: రాజధాని పిటిషన్లపై విచారణ ఆగస్టు 23 కు వాయిదా

రాజధాని పిటీషన్లపై  హైకోర్టులో విచారణ జరిగింది. ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌ల నేతృత్వంలో రాజధాని పై విచారించారు. రాజధాని తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్లను  న్యాయవాదులు వేసిన విషయం తెలిసిందే. గతంలో స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించిన నేప‌ద్యంలో ,ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ‌వాదులు స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేశారు.. విచార‌ణ అనంత‌రం న్యాయ‌స్దానం కేసును ఆగ‌ష్టు 23కు వాయిదా వేసింది.

Kodali Nani in Tirumala: కాయలు ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలు - కొడాలి నాని

తిరుమల శ్రీవారిని వైసీపి మాజీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కొడాలి నాని స్వామి వారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపకు వచ్చిన కొడాలి‌ నాని మీడియాతో మాట్లాడుతూ.. నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గ ప్రజలు., సీఎం జగన్ కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రభుత్వం బాగుండాలని శ్రీనివాసుడిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.. కాయలు ఉన్న చెట్లపైనే రాళ్ళ దెబ్బలు తగులుతాయని, పచ్చ మీడియా, ప్రతిపక్షం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని ఆయన విమర్శించారు.. దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని సీఎం జగన్ భావిస్తున్నారని, ప్రజలకు మేలు చేయాలని మా ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.. జగన్ ను భ్రష్టు పట్టించాలనే కొన్ని మీడియా సంస్థలు, దత్తపుత్రుడు, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయని, తప్పు ఉంటే మమల్ని దేవుడు శిక్షిస్తాడని కొడాలి‌ నాని చెప్పారు.

Pulichintala Project: పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద

  • పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద

  • ఎగువన తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు

  • భారీగా పులిచింతల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరద నీరు

  • పులిచింతల ప్రాజెక్ట్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 175 అడుగులు కాగా ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 166.76 అడుగులు

  • ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం వున్న నీటి నిల్వ 33.932 టీఎంసీలు

  • ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న ఇన్ ఫ్లో 12,217 క్యూసెక్కులు

Tiger Updates: అనకాపల్లిలో గేదెపై పెద్ద పులి దాడి, స్థానికుల్లో భయం భయం

  • అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పెద్దపులి పంజా

  • చోడవరం మండలం గంధవరం గ్రామంలో బెంగాల్ టైగర్ దెబ్బకు మరో గేదె బలి

  • అధికారులు ఏర్పాటు చేసిన బోన్లకు చిక్కని పెద్దపులి

  • అటవీశాఖ అధికారుల వ్యూహనికి చిక్కని బెంగాల్ టైగర్

  • తాజాగా చోడవరం మండలం గంధవరం గ్రామంలో గేదెను తిన్న బెంగాల్ టైగర్

  • ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు

  • భయం గుప్పెట్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు

Polavaram Project: పోలవరం వద్ద ఉప్పొంగిన గోదావరి

ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్ల నుండి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. లోయర్ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ముంపునకు గురైంది. పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది. దీంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి. బలహీనంగా ఉన్న గోదావరి కథలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Background

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.  మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
* అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.


* రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడన ప్రాంత కేంద్రం గుండా వెళ్తూ, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.


* తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పం అయిన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది.


ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడతాయి. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 


రాయలసీమలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


Telangana Weather: తెలంగాణలో ఇలా.. ఇక్కడ రెడ్ అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం (జూన్ 12) ఉదయం 6 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడనుంది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి జిల్లా్లలో వచ్చే 3 గంటల్లో భారీ వర్షం కురవనుంది. 


సోమవారం రాత్రి వెల్లడించిన వివరాల మేరకు తెలంగాణలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఐఎండీ అధికారులు ఈ జిల్లాల్లో రెడ్ అలర్జ్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణ పేట్ తదితర జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.