AP News :  ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖలో సెల్ఫీల(Selfie) కలవరం మొదలైంది. కొత్త విధానం ప్రభుత్వ వైద్యులకు(Govt Doctors) చిక్కులు తెచ్చిపెడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌(Katamaneni Bhaskar) తాజాగా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు ప్రభుత్వ వైద్యులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు తమ అటెండెన్స్‌ కోసం బయోమెట్రిక(Biometric) విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీంతో పాటు ఆస్పత్రిలోనే ఉన్నామని చెప్పేలా గంటగంటకీ ఓ సెల్ఫీ తీసి సంబంధిత వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం 


ఈ ఆదేశాలపై ప్రభుత్వ వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖపై కమిషనర్ కాటమనేని భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం సరిగా అందడంలేదని చాలా ఎక్కువ ఫిర్యాదులు అందాయి. దీంతో కాటమనేని భాస్కర్ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు ప్రతీ ఒక్కరు బయోమెట్రిక్ వినియోగించాలన్నారు. దీంతోపాటు గంట గంటకూ సెల్ఫీ అప్‌లోడ్ చేయాలన్నారు. 


గంటకో సెల్ఫీ 


వైద్యులు ఆసుపత్రిలో విధులు నిర్వహించే క్రమంలో ప్రతీ గంటకు సెల్ఫీ తీయాలి. ఆ సెల్ఫీలను వైద్య ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. ఈ ఆదేశాలతో వైద్యుల్లో కలవరం మొదలైంది. ఈ నిర్ణయంపై కొందరు వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్యులను అనుమానిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మహిళా వైద్యులు మాత్రం సెల్ఫీలు పెడితే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండడంలేదని, వైద్యం అందండలేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఆ సమస్యలు పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ సెల్ఫీల అప్‌లోడ్‌ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ప్రజలు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి వైద్యులకు ఈ నిర్ణయం మింగుడుపడడంలేదు. ఈ ఇష్యూ వైద్యులు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.