AP Inter Results 2022 Live: ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విడుదల, పాస్ పర్సంటేజీ ఎంతంటే
Manabadi BIEAP AP Inter Results 2022 Live Updates: ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు.
‘‘విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి జగన్ అత్యున్నత స్థాయిలో ఉంచాలని చూస్తున్నారు. విద్యా విధానంలో కొన్ని విప్లవాత్మక విధానాలు సీఎం తీసుకువస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ, మూడు నుంచి పది తరగతుల వరకు ఇలా అన్ని రకాలుగా అప్ డేట్ చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమంలో కూడా అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా సీఎం చూస్తున్నారు. విద్యా శాఖ ఇదే అంశంపై సమీక్ష చేసింది. 1350 జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం.’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.
క్రిష్ణా - 69 శాతం
గుంటూరు - 63 శాతం
విశాఖపట్నం - 59 శాతం
నెల్లూరు - 58 శాతం
పశ్చిమ గోదావరి - 57 శాతం
తూర్పు గోదావరి - 51 శాతం
చిత్తూరు - 51 శాతం
ప్రకాశం - 51 శాతం
కర్నూలు - 47 శాతం
శ్రీకాకుళం - 46 శాతం
అనంతపురం - 46 శాతం
విజయనగరం - 42 శాతం
కడప - 41 శాతం
మొత్తం సరాసరి ఉత్తీర్ణత - 54 శాతం
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు 49 శాతం, బాలికల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరంలో బాలురు 56 శాతం, బాలికల్లో 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-11-62b2b6cc2734e.html
ఏపీ ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-results-12-62b2b7e4abc44.html
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-intermediate-first-year-vocational-result-62b2b8e1b5a02.html
ఏపీ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్
https://telugu.abplive.com/exam-results/ap-inter-2nd-year-vocational-result-62b2b9fd5344a.html
ఉమ్మడి క్రిష్ణా జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో ముందు ఉంది. ఇక్కడ 76 శాతం మంది పాసయ్యారు. కడప జిల్లా చివరిలో ఉంది. ఇక్కడ 41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
ఏపీ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.
https://telugu.abplive.com/exam-results/ap-board-result-62b2b1aa8d556.html
ఫస్టియర్ లో 4 లక్షల మందిపైచిలుకు మంది పరీక్ష రాయగా 2,41,591 మంది పాసయ్యారు. అంటే 54 శాతం మంది ఫస్టియర్ లో ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ లో 4 లక్షల పైచిలుకు మంది పరీక్ష రాయగా 2,58,449 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ లో 61 శాతం మంది పాసయ్యారు.
మే నెలలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో మొదటి రెండో సంవత్సరం, వొకేషనల్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యానారాయణ విడుదల చేశారు. ఎగ్జామ్ రిజల్ట్స్ కి సంబంధించిన సీడీనీ ఆవిష్కరించారు. దానికి సంబంధించిన కోడ్ ను కూడా వెల్లడించారు.
కొద్దిసేపట్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలు అన్నీ ఒక్కసారి విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ఇంతకుముందే ప్రకటించింది. పరీక్షలు రాసిన ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. ఏపీ ఇంటర్ బోర్డు మే 24వ తేదీ వరకు పరీక్షలను పూర్తి చేసింది. ఆపై ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేశారు. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నారు. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. ఈ రిజల్ట్స్ వేళ విద్యార్థులు పాస్ అయ్యే పర్సంటేజీపై ఉత్రకంఠ నెలకొని ఉంది.
Background
Manabadi BIEAP AP Inter Results 2022 Live Updates: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు నేటి(జూన్ 22) మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఒకేషనల్ ఫలితాలు అన్నీ ఒక్కసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల అయ్యాక విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.
10 లక్షల మంది విద్యార్థులు..
ఏపీలో ఇంటర్ పరీక్షలు 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో మే 24వ తేదీ వరకు ఏపీ ఇంటర్ పరీక్షలను పూర్తి చేసింది. ఆపై ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేశారు. ఏపీలో మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు..
ఏపీలో పదో తరగతి పరీక్షల్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించింది. పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చి పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్‌ను పర్యవేక్షించారు. నేడు పరీక్షా ఫలితాల విడుదలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. విద్యాశాఖ మంత్రి బొత్స నేటి మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/లో ఫలితాలు చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మే 6న ప్రారంభమై మే 24వ తేదీతో ముగిశాయి. ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో వేగం పెంచారు. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్ రెండో వారం చివరి నాటికి స్పాట్ వాల్యుయేషన్ ( Spot Valueation ) పూర్తి చేయాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇంకా ఫలితాలు ( Results Not Ready ) సిద్ధం కానట్లు తెలుస్తోంది. ఫలితాలు సిద్ధమైన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు చెబుతోంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -