Andhra News :   టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సంగం డెయిరీ వద్ద జరిగిన ఓ ఘర్షణలో ఘటనా స్థలంలో లేకపోయినప్పటికీ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు పెట్టారని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అందరూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిగిన హైకోర్టు ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఇతరులకూ ముందస్తు బెయిల్ ఇచ్చింది.

  


ధూళిపాళ్ల నరేంద్ర మందస్తు బెయిల్ పై విచారణ హైకోర్టులో జరగక ముందే.. పోలీసులు ఆయనను అరెస్టు  చేసేందుకు ప్రయత్నించారు. వడ్లమూడిలోని సంగం డెయిరీ   దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఎవర్నీ రానీయకుండా అడ్డుకున్నారు.  డెయిరీ లోపలకు వెళ్లేందుకు పోలీసులు యత్నించారు.  అనుమతి లేకుండా వెళ్లనీయబోమంటూ డెయిరీ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై నారా లోకేష్   స్పందించారు.                                                              


సంగం డెయిరీని కబ్జా చేయాలని చూశారు, సాధ్యం కాలేదు. సర్కారు కబ్జాలకు అడ్డుపడిన టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టాడు సైకో జగన్. తనపై తప్పుడు హత్యాయత్నం కేసు జగన్ నమోదు చేయించగా, హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నరేంద్ర. బెయిల్ వచ్చేలోపే అక్రమ అరెస్టుకి యత్నించడం జగన్ సైకోయిజానికి పరాకాష్ట. నరేంద్రపై వైసీపీ పెడుతున్న తప్పుడు కేసులు, నిర్బంధాలు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు.                 సంగం డెయిరీ గేట్లు కూలగొట్టేందుకు పోలీసులు జేసీబీల్ని కూడా తీసుకు వచ్చారు. ఈ సంచలనం అయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. వెనక్కి వచ్చేయాలని చెప్పడంతో అప్పుడు పోలీసులు వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.   





 


ఈ నెల 15న ఏలూరు జిల్లాకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి తనపై సంగం డెయిరీ సిబ్బంది దాడి చేశారంటూ చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అందులో సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు చేర్చడంతో రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ ధూళిపాళ్ల  హైకోర్టును ఆశ్రయించారు.  ముుదస్తు బెయిల్  పై విచారణ ఉందని తెలిసి   ముందే టీడీపీ నేతలను  అరెస్టు చేయాలని ప్రయత్నించడం.. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.  అసలు ఘటనా స్థలంలో లేకపోయినా... తప్పుడు కేసులు పెట్టం.. ఇలా అరెస్టు ప్రయత్నం చేయడమేమిటన్న విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు.  


ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply