గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా వెంటనే విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పదకొండు శాఖలతో అనుబంధం కలిగిన విభాగాలు ఉన్నందున ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యమైందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో అన్ని అర్హతలు కలిగిన వారు 60 వేల మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, మిగతావారు కూడా అర్హత సాధించిన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని అజయ్ జైన్ వెల్లడించారు. ఇబ్బందులు తలెత్తుతాయని సచివాలయ ఉద్యోగులు భావించాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సచివాలయ ఉద్యోగుల ను రెచ్చ గొడుతున్నారని, అపోహలు సృష్టించాలని చూస్తున్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
విధులకు హాజరు కావాలి
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా విధులకు హాజరు కావాలని అజయ్ జైన్ చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై మాట్లాడారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు చాలా దారులున్నాయని చెప్పారు. ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాల్సి ఉందని.. మెుదట్లోనే ఇలా చేస్తే.. మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు.
సచివాలయ ఉద్యోగులంటే సీఎం జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అజయ్ జైన్ అన్నారు. కానీ.. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని చెప్పారు. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం సరికాదని హితవు పలికారు. ఆశించేవి జరగాలంటే.. ప్రశాంతమైన వాతావరణ ఉండాలన్నారు. అన్నీ సరిగా ఉంటేనే.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
Also Read: Mudragada Letter: మరో లేఖాస్త్రం సంధించిన ముద్రగడ... ఈసారి వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్...
Also Read: MP Bharat: ఆమె మెుదటి మహిళ.. ఎంపీ భరత్ అభినందనలు.. కామెంట్స్ తో ఆడేసుకుంటున్న నెటిజన్లు