ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా.. లేదంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  ప్రతినిధులు చెప్పారు. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండే బాగుండేదని చెప్పారు.


2010లోనే అప్పటి పీఆర్‌సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందన్నారు. కిందటి ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని.. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినట్టు చెప్పారు. తెలంగాణలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని.. పీఆర్సీ సంఘం సిఫార్సు మేరకు ఇంటి అద్దె భత్యం, సీసీఏలు.. కొనసాగడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు.. ఇచ్చే భత్యాలు అలాగే కొనసాగించాలని కోరారు.


70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని.. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయాలని.. 1993 నుంచి పనిచేస్తున్న 5 వేల మంది కంటింజెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలన్నారు. ఈ మేరకు సీఎస్ కు రాసిన లేఖలో వివరించారు.


Also Read: Minister Kannababu : రాజమార్గంలో సాక్షి పెట్టుబడులు.. ఐటీ ట్రిబ్యూనల్ తేల్చిందన్న మంత్రి కన్నబాబు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు !


Also Read: HPCL Recruitment 2022: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 14.. అప్లై చేయండిలా.. 


Also Read: Anantapur TDP: అనంతపురం టీడీపీ నేతల్లో ఎన్నికల జోష్... అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయాలు !


Also Read: Uravakonda YSRCP : ఉరవకొండలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ... పయ్యావులకు టెన్షన్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ నేతలు!


Also Read: Tammareddy : జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !




Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి