ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నవంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ  ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. గవర్నర్‌కు నవంబర్ 15న కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని పేర్కొంది. ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని డాక్టర్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 


Also Read: బీజేపీ మద్దతుతో అమరావతి రైతులకు నైతిక బలం .. పాదయాత్రలో పాల్గొననున్న ఏపీ నేతలు !


ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలింపు


ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు బుధవారం అస్వస్థతకు గురి కావడంతో ప్రత్యేక విమానంలో  హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని  ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గవర్నర్ వయసు 87 ఏళ్లు. వార్ధక్యం కారణంగా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. 


Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !


గవర్నర్ కు సీఎం జగన్ ఫోన్ 


గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. ఏఐజీ ఛైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బుధవారం వైద్యులతో ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు తెలిపారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని గవర్నర్‌కు ముఖ్యమంత్రి వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. 


Also Read:  మహిళా సాధికారతలో సువర్ణ అధ్యాయం.. చంద్రబాబుకు ఇప్పటికైనా బుద్ది రావాలన్న సీఎం జగన్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి