ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరణించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy ) పేరు మీద వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గౌతంరెడ్డి కుటుంబీకుల నుంచే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలన చేస్తోంది. గౌతంరెడ్డి పేరు మీద ఏర్పాటు చేసే అగ్రికల్చర్ యూనివర్సిటీ ( Agriculture University ) కోసం రూ. 225 కోట్లకుపైగా విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ( Mekapati Raja Mohan Reddy ) సీఎం జగన్‌తో ( CM Jagan ) చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ ఆస్తులన్నీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలవి.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ( Merits ) గౌతంరెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఆ కాలేజీ ప్రాంగణం విశాలమైనది. దాదాపుగా వంద ఎకరాల విశాలమైన స్థలంలో ఉంటుంది. అత్యంత విశాలమైన భవనాలు కూడా ఉన్నాయి. మెరిట్స్‌గా ప్రసిద్ధి చెందిన ఆ కాలేజీని ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామని.. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎంను కోరారు. సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ బడ్జెట్ ( Assembly Budget Meetings ) సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జిల్లాల విభజనపై నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అసంతృప్తి - ఆ నియోజకవర్గాలను మార్చొద్దని సీఎంకు లేఖ !
ప్రస్తుతానికి మెరిట్స్ ( Merits ) ఇంజనీరింగ్ కాలేజీని కొనసాగించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. గౌతంరెడ్డి పేరుతో ప్రభుత్వమే వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది .. దానికి సంబంధించిన అన్ని వనరులూ మేకపాటి కుటుంబం ( Mekapati Family ) సమకూరుస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యలు రావని భావిస్తున్నారు. మరో వైపు ఉదయగిరి అంటే నెల్లూరు జిల్లాలోనే మెట్ట ప్రాంతం. అక్కడ వ్యవసాయం తక్కువ. నీటి వనరులూ తక్కువ. అలాంటి చోట వ్యవసాయ యూనివర్శిటీ పెట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు.