ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ( Raghu Rama ) పరువు నష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ ( Rajat Bhargava ) మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు. రఘురామ కృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని రజత్ భార్గవ ఆరోపించారు. రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల కిందట ఏ రాష్ట్రంలోనూ లభించని పనికిమాలిన కల్తీ బ్రాండ్ల మద్యం ఏపీలోనే అమ్ముతున్నారని.. మద్యం నమూనాలను పరీక్షిస్తే, మనుషులు తాగడంవల్ల ప్రమాదకరమని తేలిందని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎస్‌జీఎస్ ల్యాబ్స్‌లో మద్యం నమూనాలను పరీక్ష చేయించామని… వొల్కనిన్, పైరోగాలో, స్కోపరోన్ అనే ప్రమాదకరమైన పదార్థాలను ఆ మద్యంలో కనుగొన్నారని ఆయన కొన్ని నివేదికలు ప్రదర్శించారు.కల్తీ మద్యం అమ్మకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు .
రాష్ట్ర, ప్రభుత్వ భద్రతకు స్పైవేర్‌లు వాడుతున్నాం - వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన !
అయితే ఈ ఆరోపణలన్నీ తప్పుడు ప్రచారమని ప్రభుత్వం ( AP Govt ) స్పష్టం చేసింది. రఘురామ పరీక్షలు చేయించిటన్లుగా చెబుతున్న ఎస్‌జీఎస్ ల్యాబ్ ( SGS Lab ) ఇచ్చిన సమాధానం లేఖను రజత్ భార్గవ మీడియాకు విడుదల చేశారు. ల్యాబ్‌కు పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అనటానికి ఆధారాలు లేవని తెలిపారు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను అనుసరించలేదని పేర్కొన్నారు.పరీక్ష చేయమన్న వాళ్లు అడగకపోవటంతో శాంపిల్స్‌ను ఐఎస్ నిబంధనల ప్రకారం చేయలేదని ఎస్‌జీఎస్ స్పష్టం చేసిందని రజత్ భార్గవ తెలిపారు. రఘురామరాజు ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్నారు.
2023 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి - గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆలస్యమయిందన్న సీఎం జగన్
శాంపిల్స్‌ను రఘురామ చెన్నైలోని ల్యాబ్‌కి పంపించటం వెనుక కారణం ఏంటో తెలియదని రజత్ భార్గవ తెలిపారు. ఎస్‌జీఎస్ శాంపిల్స్‌లో ఏ స్థాయిలో రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయో పరీక్షించలేదని లేఖలో తెలిపిందన్నారు. శాంపిల్స్ హానికరం అని ఎస్‌జీఎస్ నివేదిక ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. హైడ్రాక్సైడ్ ఉండటమే ప్రమాదకరం కాదని, కొన్ని హైరెసల్యూషన్ పరీక్షల్లో మంచి నీళ్లు కూడా తాగటానికి హానికరం అని వస్తాయని రజత్ భార్గవ చెప్పారు. ఎవరైనా పరీక్షలు చేయించవచ్చు.. కానీ బీఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా చేయించాలని అన్నారు. ప్రజల్ని తప్పు దారి పట్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రఘురామపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. రఘురామకృష్ణరాజు గతంలో ఈ నివేదిక విడుదల చేసినప్పుడే ఏపీబీసీఎల్ నోటీసులు పంపింది. ఇప్పుడు పరువునష్టం దావాకు సిద్ధమయింది.