తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పనులే పోలవరానికి శాపంగా మారాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది.  ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి గత ప్రభుత్వమే కారణం అన్నారు.  సొంత జిల్లాలో ఒక్క  నీటి ప్రాజెక్టు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు.వాస్తవాలు ఎలా ఉన్నా..మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పనులు పోలవరానికి శాపంగా మారాయని ..ప్లానింగ్ లేకుండా చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు.  రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టినట్లే.. పోలవరం కాఫర్ డ్యాంకు కూడా చంద్రబాబు చిల్లులు పెట్టారని జగన్ ఆరోపించారు. 


చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా..పనుల్లో విపరీతమైన జాప్యం జరిగిందన్నారు.  స్పిల్ వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారన్నారు. రెండు కాఫర్ డ్యాంల మధ్యలో మెయిన్ డ్యాం కట్టాలి అయితే మధ్యలో 3 పెద్ద పెద్ద ఖాళీలు వదిలి పెట్టారన్నారు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం నీటిని కుడి వైపుకు మళ్లించాలి...నీటిని మళ్లించడానికి ముందే స్పిల్ వే పెట్టాల్సి ఉందన్నారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం కట్టారని దీని వల్ల సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 
  
చంద్రబాబు ఓ విజనరీ అని తనకు తానుగా ముద్రవేసుకునే పెద్దమనిషి అని..బాబు చేసిన పనులు వల్ల ..వర్షాలు, వదరలు వచ్చినప్పుడు పనులుకు  ఇబ్బంది ఉంటుందన్నారు.పునాది పైన, లోపల కలిపి 35.6 మీటరల్ లోతు గుంట ఏర్పడిందని జగన్ తెలిపారు. ప్రస్తుతం డిజైన్స్ క్లియరెన్స్‌ పొంది దిగువ కాఫర్ డ్యాం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని జగన్ తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని చంద్రబాబుకు ఎవరు చెప్పారని జగన్ ప్రశ్నించారు. మోదీ బెడ్ రూంలోకి..షెకావత్ బెడ్ రూంలోకి  వెళ్లి విని వచ్చారా..? అని జగన్ ప్రశ్నించారు.  పోలవరం ఎత్తు ఒక  ఇంచ్ కూడా తగ్గించబోమని.. స్పష్టం చేశారు. 


 2019లో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ...వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు తీసుకున్నారని..  కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టు తీసుకున్నారని విమర్సించారు.  చంద్రబాబు వందల కోట్లు ఖర్చు పెట్టి  భజనలు చేయించుకున్నారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే  తన గొంతు నొక్కేశారని జగన్ యఆరోపించారు.  2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.పోలవరంపై వైఎస్ విగ్రహం పెట్టి ప్రాజెక్టును ఆయనకే అంకితమిస్తామన్నారు.