Stock Market update Telugu: భారత స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఫస్ట్‌ హాఫ్‌లో రేంజ్‌బౌండ్‌లో కదలాడిన సూచీలు మధ్యాహ్నం ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఐటీ స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఎగబడ్డారు. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 2.3 శాతం క్రాస్ అయినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం కొనుగోళ్లకే మొగ్గు చూపించారు. బీఎస్‌ఈ 696 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,315 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితంరోజు 57,292 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,297 వద్ద మొదలైంది. దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు సూచీ రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 56,930 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ కొనుగోళ్లు పెరగడంతో 58,052 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 696 పాయింట్ల లాభంతో 57,989 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 17,117 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,120 వద్ద ఆరంభమైంది. 17,0906 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 17,334 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 197 పాయింట్ల లాభంతో 17,315 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంకు ఉదయం 35,975 వద్ద మొదలైంది. 35,384 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,468 వద్ద గరిష్ఠాన్ని అందుకున్న సూచీ 330 పాయింట్ల లాభంతో 36,348 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీలో 42 కంపెనీల షేర్లు లాభపడగా 8 నష్టపోయాయి. టెక్‌మహీంద్రా, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌ లాభపడ్డాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, నెస్లే ఇండియా, బ్రిటానియా, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌ నష్టపోయాయి. ఐటీ, ఆటో, బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఒక శాతం లాభపడ్డాయి. రియాల్టీ ఒక శాతం తగ్గాయి.