AP Government Deposited Money For Flood Victims: ఏపీలో ఇటీవల వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, వరద బాధితుల్లో ఇప్పటివరకూ 98 శాతం మందికి పరిహారం జమ చేసినట్లు ఏపీ ప్రభుత్వం (AP Government) తెలిపింది. మొత్తం రూ.602 కోట్ల పరిహారం కేటాయించగా రూ.18 కోట్లు మాత్రమే మిగిలినట్లు వెల్లడించింది. అటు, సాంకేతిక కారణాలతో వరద సాయం అందని 2 శాతం మంది ప్రజల ఖాతాల్లోకి సోమవారం నగదు జమ చేస్తామని తెలిపింది. విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో బాధితులతో తనిఖీ చేసి సరిచేశారు.


ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే బాధ్యతను సర్కారు కలెక్టర్లకు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలకు అధికార యంత్రాంగం ద్వారా అకౌంట్లతో డబ్బు జమ చేయనుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయంపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు. బాధితులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందని చెప్పారు. కాగా, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వరద సాయం కింద రాష్ట్రానికి రూ.1,063 కోట్లు కేటాయించింది.


Also Read: Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్