చెన్నై: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కామెంట్ల యుద్ధం కొనసాగుతోంది. తిరుమల లడ్డూ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించుకుందామంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా జస్ట్ ఆస్కింగ్ అంటూ కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ఓసారి, అందరికీ సమానత్వం ఎక్కడా డిప్యూటీ సీఎం అంటూ పవన్ కళ్యాణ్ ను చికాకు పెడుతూ వస్తున్నారు.
చెన్నైలో జరిగిన ఈవెంట్లో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. మాకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. ఆయన సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరోచోట డిప్యూటీ సీఎం ఉన్నారు. అతను ఏది పడితే అది మాట్లాడతాడంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. విత్ డిప్యూటీ సీఎం అని పేర్కొటూ జస్ట్ ఆస్కింగ్ అనే క్యాప్షన్ తో ఉదయనిధి స్టాలిన్ తో దిగిన ఫొటోను ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో మ్యాటర్ రాయకుండా జస్ట్ ఆస్కింగ్ అంటే నీ పిచ్చి పీక్స్ కు చేరుకుందని పవన్ ఫ్యాన్స్ ప్రకాష్ రాజ్ పై మండిపడుతున్నారు. డీఎంకే శ్రేణులు మాత్రం ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
చెన్నైలోని కలైవానర్ ఎరీనాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ తిరుచ్చి శివ రాసిన 5 పుస్తకాలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) విడుదల చేశారు. పుస్తకావిష్కరణ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. డీఎంకే పార్టీ అధినేతతో కలిసి తిరుచ్చి శివ నడిచారని తెలిపారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. యువతకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు తిరుచ్చి శివ. 45 ఏళ్ల తర్వాత పార్లమెంట్‌లో ట్రాన్స్‌జెండర్ల కోసం వ్యక్తిగత తీర్మానం తీసుకొచ్చిన నేతగా ఘనత వహించారని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు సమాజానికి అవసరమని, ఆయనలా భావ వ్యక్తీకరణ చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం కోసం వెనుకాడకుండా ఫైట్ చేస్తారని ప్రకాష్ రాజ్ ను ప్రశంసించారు.
ద్రావిడ ఉద్యమాన్ని అణకదొక్కలేరు..
ద్రవిడ ఉద్యమాన్ని కూల్చేయాలని కొందరి అభిప్రాయ పడుతున్నారని, అయితే తిరుచ్చి శివ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆ ఉద్యమాన్ని ఎవరు టచ్ చేయలేరని నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ నేతగా మాట్లాడటం లేదని, కేవలం నటుడిగా మాత్రమే మాట్లాడతా అన్నారు. అయితే తాను ఏం మాట్లాడినా అది రాజకీయం అవుతుందన్నారు. ఆర్టిస్ట్ అయినందున ఏం మాట్లాడకూడదని ఎక్కడా లేదన్నారు. ఒకవేళ బస్సులో దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టామనుకోండి. అది దొంగలను బాధిస్తుందన్నారు. అదేవిధంగా తన మాటలు, గుర్తింపును, భాషను, వ్యక్తిత్వాన్ని, రాష్ట్రాన్ని దొంగిలించడం వీలుకాదని బోర్డు పెడదాం. కానీ అది కొందరు దొంగలను ఎంతగానో బాధ కలిగిస్తుందని.. వాళ్లు బాధపడినా ఫర్వాలేదన్నారు ప్రకాష్ రాజ్.
చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నిస్తున్నారు
ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో తాను ఎగ్జామ్స్ రాసిన సమయంలో తిరుచ్చి శివ కూడా పరీక్షలకు హాజరయ్యారని గుర్తుచేసుకున్నారు. మీసా కాలంలో రాష్ట్ర పార్టీలను నిషేధించిన సమయంలో పార్టీల పేర్లు మార్చినట్లు చెప్పారు. కానీ 75 ఏళ్లుగా పార్టీ పేరు, జెండా, విధానాన్ని, సిద్ధాంతాన్ని మార్చుకోలేదని స్పష్టం చేశారు. కానీ బీజేపీ వాళ్లు అబద్ధాలు, అవాస్తవాలు, పుకార్లు ప్రచారం చేస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. చరిత్రను తిరగరాసి అంతా నాశనం చేయాలని చూస్తున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే తిరుచ్చి శివలాంటి వ్యక్తులు కావాలన్నారు.
Also Read: Prakash Raj: 'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!' - నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్