Incharge Vice Chancellors To AP Universities: ఏపీలోని పలు యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలను నియమిస్తూ ప్రభుత్వం (AP Government) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఆరోగ్య వర్శిటీ వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ.. డీఎంఈ నరసింహంకు ఇంఛార్జీ వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలు వీరే



  • ఎస్‍వీయూ ఇన్‍ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు

  • ఎస్‍కేయూ ఇన్‍ఛార్జ్ వీసీగా బి.అనిత

  • విశాఖ ఏయూ ఇన్‍ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్ రావు

  • నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్

  • జేఎన్‍టీయూ అనంతపురం ఇన్‍ఛార్జ్ వీసీగా సుదర్శన్‍రావు

  • పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా వి.ఉమ 

  • జేఎన్‍టీయూ విజయనగరం ఇన్‍ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మి 

  • జేఎన్‍టీయూ కాకినాడ ఇన్‍ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ

  • నన్నయ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా వై.శ్రీనివాసరావు

  • విక్రమ సింహపురి వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా సారంగం విజయభాస్కర్ రావు

  • కృష్ణా వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఆర్.శ్రీనివాస్ రావు

  • కర్నూలు రాయలసీమ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఎన్‍టీకే నాయక్

  • ద్రవిడ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా ఎం.దొరస్వామి 

  • కడప వైఎస్సార్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్

  • ఆంధ్రకేసరి వర్సిటీ (ఒంగోలు) ఇన్‍ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తి

  • అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఇన్‍ఛార్జ్ వీసీగా పఠాన్ షేక్ ఖాన్

  • కడప యోగి వేమన ఇన్‍ఛార్జ్ వీసీగా కె.కృష్ణారెడ్డి నియామకం.


Also Read: Tirumala : శ్రీవాణి టిక్కెట్లు కొని తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా ? - ఈ విషయం తెలుసుకోవాల్సిందే