AP GAD Key Orders On Ministerial Chambers: రాష్ట్రంలో మరో 5 రోజుల్లో జూన్ 4న కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీ సాధారణ పరిపాలన శాఖ (GAD) గురువారం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. అలాగే, సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో వాహన తనిఖీలు చేయాలని సచివాలయ భద్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ సిబ్బందికి నిర్దేశించింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని.. ఆ లోపే వాటిని ఖాళీ చేయాలని సూచించింది. జూన్ 4న ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుండడంతో స్వాధీన ప్రక్రియను జీఏడీ ప్రారంభించింది.


Also Read: Pinnelli in highcourt : తన కేసుల్లో దర్యాప్తు అధికారుల్ని మార్చాలని పిన్నెల్లి పిటిషన్ - హైకోర్టు నోటీసులు