AP Government Fact Check Clarifies About Meenakshi Chaudhary As AP Women Empowerment Brand Ambassador: ప్రముఖ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఏపీ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేశాయి. 'ఏపీ వుమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి', 'హీరోయిన్ మీనాక్షి చౌదరికి కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం' అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. తాజాగా.. దీనిపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. అది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ (AP Government Fact Check) విభాగం 'X' వేదికగా వెల్లడించింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
తెలుగు ప్రేక్షకులకు చేరువైన మీనాక్షి
హర్యానాలోని పంచకులలో ఓ పంజాబీ ఫ్యామిలీలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జన్మించారు. ఆమె తండ్రి దివంగత బీఆర్ చౌదరి ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు. డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటారు. అందాల పోటీల్లో పాల్గొన్న మీనాక్షి.. ఫెమినా మిస్ ఇండియా విన్నర్‌గా నిలిచారు. 2021లో వచ్చిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి చౌదరి.. ఖిలాడీ, అడవి శేష్ హిరోగా నటించిన 'హిట్: ది సెకండ్ కేస్' చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన 'సంక్రాంతి వస్తున్నాం' రీసెంట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.