Mango Shape Egg : వేసవి కాలం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చే పండు మామిడి(Mango). మండుతున్న వేడిని తట్టుకునేందుకు చల్లటి మామిడి షేక్‌తో పాటు రుచికరమైన మామిడి పండ్లను ఆస్వాదిస్తుంటాం. అయితే మామిడి పండులా కనిపించే కోడి గుడ్డు(Egg)ను మీరు ఎప్పుడైనా చూశారా? మామిడి పండు లాంటి గుడ్డు అని ఆశ్చర్యపోకండి. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉగాది(Ugadi) తెలుగు సంవత్సరాది. వేసవి ప్రారంభంలో వచ్చే పండుగ. కొత్త సంవత్సరానికి సూచికగా ఉగాది జరుపుకుంటాం. ఉగాది ఉంటే మనకు గుర్తొచ్చిది మామిడి. ఈసారి ఓ కోడిగుడ్డు కూడా ఈ పండుగలో పాల్గొంటోంది. ఎందుకంటే అది మామిడిపండులా కనిపిస్తుంది. మనం తెలుపు లేదా గోధుమ రంగు గుడ్లు చూసే ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని ఓ కిరాణా దుకాణం యజమాని మామిడికాయలా ఉన్న గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. మామిడి కాయ ఆకారంలో ఉన్న గుడ్డు నిజానికి గుడ్డు అని దుకాణం యజమాని గ్రహించాడు.  



తెల్ల మామిడి కాయ 


సాధారణంగా గుడ్లు గుండ్రంగా, కోలగా ఉంటుంది. కానీ ఈ గుడ్డు ఒక మాడికాయ రూపంలో కనిపించడంతో జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది గుడ్డేనా అని చాలామందికి అనుమానం వ్యక్తం అవుతోంది. అది తెల్ల మామిడి కాయా లేక కోడు గుడ్డు అన్న అనుమానం కలుగుతోంది. పిఠాపురం మాదాపురం రోడ్డులో గల బొమ్మిడి సత్తిబాబు అనే కిరాణా వ్యాపారి ఈ గుడ్డును గుర్తించాడు. అమ్మకం కోసం కోళ్ల ఫారాల నుంచి తెచ్చిన గుడ్లు అట్టల్లో ఇలాంటి గుడ్డు వచ్చిందని షాపు యజమాని తెలిపాడు.



గుడ్డు చేసేందుకు పోటెత్తిన జనం 


ఈ వార్త ఆ నోట ఈ నోట ప్రచారం అయ్యింది. దీంతో మామిడికాయ లాంటి గుడ్డును చూసేందుకు కిరాణా దుకాణానికి జనం పోటెత్తారు. కిరాణా దుకాణం యజమాని కూడా అది మామిడికాయనా.. కోడిగుడ్డునా అనే అయోమయంలో పడ్డారు. దాని విచిత్రమైన ఆకారం కారణంగా ప్రజాదరణను సద్వినియోగం చేసుకోవాలని భావించిన స్టోర్ యజమాని ఉగాది పండుగ సందర్భంగా మొంగో ఆకారంలో ఉన్న గుడ్డును పోటీలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 



ఉగాదికి స్పెషల్ మామిడి 


ఉగాది పండుగ రోజున రుచికరమైన షడ్రుచుల సమ్మిళితమైన పచ్చడిని తయారు చేస్తారు. తీపి, చేదు, పులుపు, వగరు, ఇలా షడ్రుచుల మిశ్రమమైన 'పచ్చడి' తయారు చేసి ఆస్వాదిస్తారు. ఉగాది పండుగను సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు నూతన సంవత్సరం. చైత్ర మాసం మొదటి రోజున ఉగాదిగా జరుపుకుంటారు. 'ఉగాది' అనే పేరు 'యుగ', 'ఆది' అనే రెండు సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. కొత్త సంవత్సరంలో సమృద్ధి, శ్రేయస్సు, ఆనందాన్ని స్వాగతించడానికి ఉగాది పండుగ జరుపుకుంటారు.