Pawan Kalyan Comments on Allu Arjun case in kerala | ఎర్నాకుళం: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, కల్తీ నెయ్యి ఘటనల దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ టిమ్ నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అల్లు అర్జున్ కేసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అటు నుంచి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ అకీరాతో కలిసి పూజలు చేసి, పూజారిని ఆలయ విశిష్టత అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎర్నాకుళం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. తిరుపతిలో కల్తీ నెయ్యి ఘటనపై స్పందించారు. తిరుమల బాలాజీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయన ప్రసాదాలను సైతం అంతే పవిత్రతతో స్వీకరిస్తారు. కేరళ నుంచి సైతం ఎంతో మంది తిరుమల శ్రీ వెకంటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కానీ తిరుమలలో నెయ్యి కల్తీ జరగడం దురదృష్టకరం. ఈ కేసులో సిట్ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయాల నుంచి ప్రజలు డబ్బు కోరుకోరు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తాం.
అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు ఇప్పటికీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అల్లు అర్జున్ ఘటనపై ఎర్నాకుళంలో నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన పవన్ కళ్యాణ్.. ఇది దురదృష్టకరమైన ఘటన. అయితే ఈ సమస్య ఇప్పటికే ముగిసిపోయింది. సెలబ్రిటీలకు ఏదో ఒక టైంలో ఇలాంటివి అనుకోనివి జరుగుతుంటాయి. కానీ సెలబ్రిటీలే సంయమనం పాటిస్తూ, కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. బాలుడు శ్రీతేజ్ త్వరలో కోలుకుంటాడని ఆకాంక్షించారు’ పవన్ కళ్యాణ్.
Also Read: Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, వెంట కుమారుడు అకీరా నందన్ Photos చూశారా