Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Vishwaksen : 'బాయ్ కాట్ లైలా' ట్రెండ్ పై విశ్వక్ సేన్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. "ప్రతీసారి తగ్గను, నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగకండి" అంటూ ట్వీట్ చేశాడు విశ్వక్ సేన్.

'లైలా' మూవీ వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతుంది. తాజాగా విశ్వక్ సేన్ 'లైలా' మూవీని బాయ్ కట్ చేయాలని చేస్తున్న ట్రెండ్ పై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా "ప్రతిసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు" అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
విశ్వక్ సేన్ పోస్ట్ లో ఏముందంటే?
గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో 'లైలా' మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్వక్ సేన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో "నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్, నా సినిమాకు సంబంధించి మాత్రమే. ఇది సోనూ మోడల్ ఫస్ట్ లుక్ పోస్టర్. గత నెల రిలీజ్ అయింది. అలాగే రెడ్ సూట్ ఫోటో కూడా గతంలో తీసిందే. లవ్ ని స్ప్రెడ్ చేయండి, పీస్ ను మెయింటైన్ చేయండి. నేను ప్రతి పోస్టర్ లేదా నా సినిమా గురించి ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు రెండుసార్లు ఆలోచించను. అతను సోనూ మోడల్. ఫిబ్రవరి 14న ఈ వ్యక్తినీ థియేటర్లలో కలవండి" అంటూ విశ్వక్ రాసుకొచ్చారు.
అలాగే నెట్టింట కామెంట్స్ తో విరుచుకు పడుతున్న వారికి ఇదే పోస్ట్ లో విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "సోషల్ మీడియాలో ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే సహించేది లేదు. ప్రతిసారి తగ్గను... నిన్న ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ల గురించి బ్యాడ్ గా ఫీల్ అయ్యాను. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. ఓవర్ థింకింగ్ ఆపి, ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెప్తున్నా... నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాని రాజకీయాల్లోకి లాగకండి" అంటూ లైలా, బాయ్ కాట్ ద బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్స్ ని పోస్ట్ చేశాడు. అంతే కాకుండా అతను షేర్ చేసిన ఆ రెండు పోస్టర్స్ లోనూ మిడిల్ ఫింగర్స్ చూపిస్తున్నట్టుగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
అసలు వివాదం ఏంటంటే?
మాస్కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'లైలా'. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. గతంలో వైసీపీకి సపోర్ట్ చేసిన పృథ్వీ, ఎస్విబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా చేపట్టారు. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ అతడిని పక్కన పెట్టింది. ఆ తర్వాత వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేస్తూ పృథ్వీ జనసేనకు దగ్గరయ్యారు. రీసెంట్ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేసిన ఆయన తాజాగా 'లైలా' ఈవెంట్లో చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి. 11 మేకలు అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ విమర్శలు వినిపించాయి. దీంతో సోషల్ మీడియాలో 'లైలా' మూవీని బాయ్ కాట్ చేయాలని పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సాహూ గారపాటితో పాటు హీరో విశ్వక్ సేన్ కూడా దిగి వచ్చి, పృథ్వీ చేసిన కామెంట్స్ కి సారీ చెప్పారు. మరోవైపు పృథ్వీ హైబీపీతో హాస్పిటల్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్