Prudhvi Latest Comments On YSRCP Party: ఏపీలోని వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ మీద నటుడు పృథ్వీ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పేది లేదంటూ రాయలేని మాటలతో, బూతులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ, సినిమా వర్గాలలో కలకలం సృష్టిస్తున్నాయి.
వైసీపీకి 11 అంటే వణుకు ఎందుకు?
విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందిన 'లైలా' సినిమా (Laila Movie)లో 30 ఇయర్స్ పృథ్వీ అలియాస్ పృథ్వీ రాజ్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉన్నాయని, క్లైమాక్స్ వచ్చేసరికి 11 మిగులుతాయని పృథ్వీ రాజ్ పేర్కొన్నారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఏపీ ఎన్నికలు ముగిశాక ఆ సంఖ్య 11కు చేరింది.
వైసీపీని ఉద్దేశించి 30 ఇయర్స్ పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దాంతో ఆయన మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. తన తల్లిని దూషించారని, ఆ స్ట్రెస్ తీసుకోలేక ఆస్పత్రి పాలయ్యారట. బాయ్ కాట్ లైలా పేరుతో పాతిక వేలకు పైగా ట్వీట్లు చేశారు. దాంతో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరి నటుడు పృథ్వీ వ్యాఖ్యలకు తమ సినిమాకు సంబంధం లేదని, ఓ నటుడు చేసిన వ్యాఖ్యలకు చిత్ర బృందం అంతటిని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు. అయినా సరే వైసీపీ సోషల్ మీడియా శాంతించలేదు. పృథ్వీతో తమకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తుంది. తన సినిమాకు రాజకీయాలకు ముడి పెట్టవద్దని విశ్వక్ ట్వీట్ చేశారు. అది పక్కన పెడితే... క్షమాపణలు చెప్పేది లేదని పృథ్వీ మండిపడ్డారు.
''లైలా సినిమాలో నేను మేకల సత్తి క్యారెక్టర్ చేశాను. ప్రీ రిలీజ్ వేడుకలో నా పాత్ర గురించి చెప్పాను. షూటింగ్ టైంలో జరిగినది చెప్పాను. సినిమా ప్రారంభం అయినప్పుడు 150 మేకలు ఉన్నాయని, చివరకు వచ్చేసరికి మా అసిస్టెంటును అడిగితే పదో 11 లో ఉన్నాయని చెబితే కామెడీగా ఉంటుందని చెప్పాను. అంతే తప్ప వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినది కాదు. మా నాయకుడు అధికారంలోకి వచ్చాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ గురించి మాట్లాడవలసిన అవసరం మాకు ఏముంది? వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయినా 11 అంటే వాళ్లకు అంత వణుకు ఎందుకు? గజగజ వణుకుతున్నారు'' అని పృథ్వీ పేర్కొన్నారు.
Also Read: కొడుకు కోడలి ముందు ఇటువంటి వీడియోలు వద్దు... లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్‌తో ఇబ్బంది పడిన నాగార్జున
నా తల్లి బ్రతికుంటే నరికేసే వాడిని...
400 ఫోన్లు చేస్తారా? ఫోనుల్లో బెదిరిస్తారా?
వైసీపీకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద వంటివి లేవని పృథ్వీ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిని తీవ్రంగా దూషించారని, తన తల్లి గురించి వాళ్లకు ఏం తెలుసు? అని పృథ్వీ ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఫోనులు మొదలు పెట్టారు.సెకన్ సెకన్‌కు ఫోన్ చేశారు. నా దగ్గర ప్రతి నెంబర్ ఉంది. సుమారు నాలుగు వందల ఫోనులు వచ్చాయి. నా తల్లి చనిపోయిన సరే ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేశారు. తల్లి కనక బ్రతికి ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడి ఉంటే నరికేసే వాడిని. ఫోనుల్లో బెదిరిస్తున్నారు. నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేశారు. అందరిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తా'' అని అన్నారు.
Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్