Posting For ABV :   రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.  ఆయనను స్టేషనరీ , ప్రింటింగ్ అండ్ పర్చేజింగ్  డిపార్టుమెంట్‌కు కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న  ఐపీఎస్ విజయ్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ ఇచ్చిన విషయాన్ని కేంద్ర హోంశాఖకు కూడా తెలిపారు.


జగన్‌నూ పిలిచిన దీదీ - రానే రానన్న ఏపీ సీఎం ! బయటకొచ్చిన లేఖ


సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి8న విధుల్లోంచి  సస్పెండ్ చేసింది.  ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీవీ కోర్టులలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు   ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోటానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సస్పెన్షన్ రద్దయ్యింది. ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది పిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పి విచారణ ముగించింది. ఏబీవీ ఫిబ్రవరి 8నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు రావలసిన ప్రయోజనాలు అన్నీ కల్పించాలని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్నాసనం ఆదేశించింది. 


పెగాసస్‌ మాత్రమే కాదు డేటాచోరీపైనా విచారణ - మూడు నెలల్లో నివేదిక ఇస్తామన్న భూమన !


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు మే 18వ తేదీన  జీవో జారీ చేశారు.  తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు ఇచ్చినట్లుగా ఆయన జీఎడీలో రిపోర్ట్ చేశారు. అయితే పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. దాదాపుగా నెల అవుతూండటంతో మళ్లీ ఆయన సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ లోపే ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


రైతులకు మంత్రి కాకాణి గుడ్‌న్యూస్ - ఈ క్రాప్‌ నమోదు చేసుకోండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు
 
తనను సస్పెన్షన్ చేసినరోజు నుంచి సర్వీసులోకి తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరుతున్నారు. రెండేళ్ల కాలాన్ని కూడా సర్వీసు లోకితీసుకోవాలని కోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు.