Input Subsidy To AP Farmers: ఏ సీజన్ లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో సాయం చేస్తున్నామని, మొత్తం 5,97,311 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేల కోత, ఇసుక మేటలతో పంట నష్టపోయిన వారికీ సాయం అందిచామని, దీంతోపాటుగా నేడు 1220 రైతు గ్రూప్ లకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు చెల్లించామని తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 542.06 కోట్లు, వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లు మొత్తం కలిపి రూ. 571.57 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. విత్తనం నుండి అమ్మకం వరకు గొప్ప కార్యక్రమం ఆర్బీకేల ద్వారా జరుగుతోంది. యంత్రసేవా పథకం ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వైయస్ఆర్ రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ పథకాల ద్వారా రెండున్నారేళ్ల కాలంలో రైతన్నకు అండగా నిలిచామని సీఎం జగన్ అన్నారు.
గతంలో కష్టాలు.. మన ప్రభుత్వం వచ్చాక వర్షాలు..
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వర్షాలు సమృద్ధిగా కురిశాయి. రాయలసీమలో కూడా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. ఏపీలోని అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోయారు. వారికి పరిహారం అందిస్తూ తోడుగా నిలిచామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సరిగా ఇవ్వలేదు. ఇచ్చినా కొద్దిమందికి మాత్రమే ఇచ్చింది. అనేక మంది రైతులకు సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసింది. నేడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ శాస్త్రీయంగా అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ క్రాప్ డేటాను ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టామని సీఎం వివరించారు.
Also Read: Manchu Meet Jagan : మెగాస్టార్ టీం కంటే మంచు విష్ణుకే ఎక్కువ పవర్ ! జగన్‌తో భేటీలో ఇదే హైలెట్...