చదువు అనే అస్త్రంతో పేదరికాన్ని జయించవచ్చని ఏపీ సీఎం జగన్ అన్నారు. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువే అన్న ఆయన... పోటీ ప్రపంచంలో వారి కాళ్లపై వాళ్లు నిలబడడానికి చదువు ఉపయోగపడుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని పోతవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోమవారం ‘మన బడి నాడు-నేడు’ మొదటి దశ పనులను ఆయన విద్యార్థులకు అంకితం ఇచ్చారు. అలాగే నాడు నేడు రెండోదశ పనులకు శంకు స్థాపన, జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. 


Also Read: Nadu Nedu Phase 2: నాడు-నేడు పాఠశాలలు విద్యార్థులకు అంకితం... కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. ఏపీ సీఎం జగన్


విద్యా కానుకకు రూ.1,380 కోట్లు ఖర్చు


రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఆయన...విద్యా పథకాలకు గత రెండేళ్లలో రూ.32,714 కోట్లు ఖర్చు చేశామన్నారు. డిగ్రీ, వృత్తి విద్యను హక్కుగా చదువుకునేలా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకోస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల రూపురేఖలను మార్చి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దామని సీఎం జగన్ అన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి స్కూలు బ్యాగు, పుస్తకాలు, డిక్షనరీ అందిస్తున్నామన్నారు. రెండేళ్లలో విద్యా కానుకకు రూ.1,380 కోట్లు ఖర్చు చేశామన్న సీఎం... ఈ ఏడాది 42.32 లక్షల మందికి రూ.731 కోట్లతో కిట్లు ఇస్తున్నామన్నారు. నాడు-నేడు తొలిదశ భాగంగా 15,700 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు. రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక హంగులతో రూపుదిద్దుతున్నామన్నారు. 


ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సినిమాలు, గేమ్స్‌ ద్వారా ఆంగ్లంపై పట్టు పెంచేలా ల్యాబ్‌లు రూపొందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అప్పట్లో 37.20 లక్షల మంది విద్యనభ్యసిస్తే, ఇప్పుడా ఆ సంఖ్య 43.43 లక్షలకు పెరిగిందని చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో బడులు తెరవాలని ఆదేశించామని ఆయన అన్నారు. 


Also Read: Jaga Tour In East Godavari: స్టూడెంట్‌గా స్కూల్‌ బ్యాగ్ భుజాన వేసుకొని... టీచర్‌గా బోర్డుపై రాసిన జగన్.. తూర్పుగోదావరి టూర్‌లో ఇంట్రస్టింగ్ వీడియో


థ్యాంక్యూ మావయ్య


ముఖ్యమంత్రి సభా వేదికపై ఇద్దరు చిన్నారుల ప్రసంగం  అందర్నీ ఆకట్టుకుంది. థాంక్యూ మావయ్య అంటూ చిన్నరుల ప్రసంగానికి సీఎం జగన్ ముగ్ధులై దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. ‘మా నాన్న హెచ్‌ఎం. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా.


ఏపీలో 6 రకాల పాఠశాలలు



  • ఏపీలోని 57 వేల పాఠశాలలను 6 కేటగిరీలుగా విభజించాలని సీఎం జగన్‌ అన్నారు. ఇవేంటంటే

  •  శాటిలైట్‌ ఫౌండేషన్‌: గ్రామ శివారు ప్రాంతాల్లోని పాఠశాలలను శాటిలైట్‌ ఫౌండేషన్‌ పాఠశాలలుగా పిలుస్తారు. ఇవి ఫౌండేషన్‌ స్కూళ్లకు అనుసంధానంగా పనిచేస్తాయి.

  •  ఫౌండేషన్‌ స్కూళ్లు: గ్రామం నుంచి ఒక కి.మీ. దూరంలో ఫౌండేషన్‌ స్కూళ్లు నిర్మిస్తారు. ప్రీపైమరీ(పీపీ) 1, 2తోపాటు ఒకటి, రెండు తరగతులు వీటిల్లో నిర్వహిస్తారు. 

  •  ఫౌండేషన్‌ స్కూలు ప్లస్‌: పీపీ 1, 2, ఒకటి నుంచి అయిదు తరగతుల విద్యార్థులకు బోధిస్తారు. 

  •  ప్రీహైస్కూలు: 3 నుంచి 7 లేదా ఎనిమిదో తరగతి వరకు ఇక్కడ బోధన ఉంటుంది.

  • హైస్కూల్స్‌: ఈ పరిధిలో మూడు నుంచి పదో తరగతి వరకు తరగతులు ఉంటాయి.

  • హైస్కూలు ప్లస్‌: మూడు నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ బోధిస్తారు. 


Also Read: AP CM Jagan: ఆ పది అంశాలతోనే బడులు పునరుద్ధరణ.. పిల్లల భవిష్యత్‌ కోసమే బడులు తెరిచామన్న సీఎం జగన్