ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం జగన్(CM Jagan) బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అదనపు ఆదాయం(Additional Income) కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రాల సొంత ఆదాయాన్ని(ఎస్ఓఆర్) పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయం(State Own Resources) పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలన్నారు. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలన్నారు.
కలెక్టర్లు భేష్
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు(Collectors) క్రియాశీలకంగా వ్యవహరించారని సీఎం జగన్ అన్నారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సీఎం సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీ(SOP)లను పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను(VAT Cases) పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టిసారించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే(Gram, Ward Sachivalayas) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించారు. ఈ విధానంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదన్నారు. ఆ మేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి, రూ.3 వేల కోట్లకు మూడు ఎంవోయూలు : మంత్రి గౌతమ్ రెడ్డి
ఉచిత రిజిస్ట్రేషన్లు
ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల పేదలకు భారీగా లబ్ధి చేకూరిందని అధికారులు ముఖ్యమంత్రి(Chief Minister)కి వివరించారు. ఓటీఎస్ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల(Free Registrations) రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల కింద పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరిందని అధికారులు వివరించారు. గతంలో ఎన్నడూ ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు.
Also Read: గురువారం మీటింగ్ సక్సెస్ అయితే ఏపీకి కాసుల పంటే ! "త్రిసభ్య కమిటీ" చర్చలపై ఉత్కంఠ..