ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్(Dubai) లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్‌ ఎక్స్‌పో వేదికను వినియోగించుకుంటుంది. దుబాయ్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు జరిగే పెట్టుబుడుల సదస్సులో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేసింది. పెట్టుబడులు ఆకర్షణే లక్షంగా సాగుతున్న ఈ పర్యటనలో పలు కంపెనీలతో పరిశ్రమల శాఖ ఎంవోయూ(MoU)లు చేసుకుంటుంది. ఇప్పటి వరకూ రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంగళవారం అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏసియా పరిశ్రమతో పరిశ్రమల శాఖ కీలక ఒప్పందం చేసుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం(గిడ్డంగులు), వాతావరణ ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ(Technology) అభివృద్ధికి రెండు ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీద్ ఏసియా సీడీవో(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో-యిస్ జావియర్ బాల్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 






జెబెలి అలీ పోర్టు(Jebel Ali Port), పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమను మంత్రి గౌతమ్ రెడ్డి బృందం సందర్శించింది. ఎగుమతులకు సంబంధించిన జెబెలి అలీ పోర్టు ప్రత్యేకతలను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. 10 లక్షల కార్లను స్టోరేజ్ చేసే సామర్థ్యం ఉన్న పోర్టు, ఎలక్ట్రిక్, లాజిస్టిక్(Logistic), మానుఫాక్చరింగ్(Manufacturing), షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లు, ఎగుమతుల చేసే విధానాలను ఆసక్తిగా పరిశీలించారు. ఏపీలో కూడా పోర్టు ఆధారిత అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు డీపీ వరల్డ్ ఆసక్తి చూపించింది. జెబెలి అలీ పోర్టులో కార్యకలాపాలను పరిశీలించేందుకు 40 వేల సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డికి డీపీ వరల్డ్ మేనేజర్ అహ్మద్ తెలిపారు. 


మల్టీ పార్కింగ్ స్టోరేజ్(Multi Parking Storage) తో సహా అలీ పోర్టులో ఉన్న ప్రత్యేకతలు ఏపీలో పోర్టుల నిర్వహణ(Ports Management) ఎలా చేయాలనే ఉద్దేశంతో పోర్టు పర్యటన సాగింది. డీపీ వరల్డ్(DP World) పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutam Reddy) సమావేశం అయ్యారు. ఏపీలో మౌలిక వసతుల గురించి డీపీ వరల్డ్ ప్రతినిధులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తో  సమావేశమైన ఆ సంస్థ సీఈవో యువరాజ్ నారాయణ్(YuvaRaj Narayan) తో చర్చించిన అంశాలకు ప్రస్తుత సమావేశంలోనూ చర్చించారు. అనంతరం అబుదాబీలోని ఉక్కు రంగానికి చెందిన కొనరస్ కంపెనీని మంత్రి బృందం సందర్శించింది. సీఎం జగన్(CM Jagan) నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్(Steel Plant) గురించి మంత్రి కొనరస్ ప్రతినిధులకు తెలిపారు. గ్యాస్ సహా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.