AP Cabinet Meeting: అమరావతి..  ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత జరగనున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి కేబినెట్ చర్చింనుంది.


ఏపీ రాష్ట్ర మంత్రివర్గం మే 13న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో ఎదుర్కొంటున్న విద్యుత్ కోతల నివారణ, మే నెలలో మంచి నీటి ఎద్దడి, పోలవరం ప్రాజెక్ట్ వంటి విషయాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు రాష్ట్ర మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేస్తో్ంది. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.


సచివాలయం వేదికగా.. 
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం వేదికగా నూతన మంత్రివర్గం బేటీ కానుంది. కొత్త మంత్రులు అందరూ బాధ్యతలు స్వీకరించి తమ శాఖలపై సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సీఎం జగన్ తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు కొత్త మంత్రులు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆఫీసు అన్ని శాఖలు, విభాగాధిపతులకు ఇదివరకే సర్కులర్ జారీ చేసింది. 


పొత్తుల అంశాలపై చర్చ జరుగుతుందా ? 
ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు పదే పదే పొత్తుల గురించి ప్రస్తావించడం, అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని వ్యాఖ్యానించడం అధికార వైఎస్సార్‌సీపీలో చర్చకు కారణమైంది. ఇప్పటివరకూ ఓ ఎత్తు, ఇకనుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పరిపాలన మరో ఎత్తు అని కొత్త కేబినెట్‌లో జగన్  మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఏపీలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును జల వనరులశాఖ కొత్త మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి, పనుల పురోగతిపై ఏపీ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రం చేస్తున్న అప్పుడు, ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు సమకూర్చడం లాంటి విషయాలు చర్చకు రానున్నాయి. 


Also Read: Bandla Ganesh Vs Vijaysai Reddy : బండ్ల గణేష్ వర్సెస్ విజయసాయి రెడ్డి, మరోసారి ట్వీట్ వార్


Also Read: Tammineni Seetharam : చంద్రబాబు యాత్రలు అసమర్థుడి అంతిమయాత్రలు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం : స్పీకర్ తమ్మినేని సీతారాం