తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం పశ్చిమ–వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతాలలో కొనసాగుతుంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంది. 


Also read: ఈ అలవాట్లు మానుకోండి... లేకుంటే కిడ్నీలకు ప్రమాదం తప్పదు






నైరుతి రుతుపవనాల తిరోగమనం


రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది జూన్‌ 5న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో సాధారణ వర్షపాతం కంటే 38 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం. ఈ నెల 6న మొదలైన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 12 నాటికి దాదాపు పూర్తయిందని వాతావరణ శాఖ వెల్లడించింది, గతేడాది(అక్టోబర్‌ 28)తో పోలిస్తే 16 రోజుల ముందే రుతుపవనాల విరమణ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు 


Also Read: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... నిలకడగా గోల్డ్, సిల్వర్ ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా


Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి