Breaking News Live: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 8 కోడె దూడలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 8 కోడె దూడలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ హల్ చల్ చేశాడు. గంజాయి మత్తులో చొక్కా లేకుండా రౌడీ షీటర్ రియాజ్ స్టేషన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఎస్సై ను సైతం లెక్కచేయకుండా దుర్భాషలాడిన రౌడీ షీటర్ రియాజ్ గతంలో ఒక హత్య, పలు దొంగతనాల్లో నిందితుడుగా పోలీసులు తెలిపారు. అసభ్య పదజాలంతో తిడుతున్నా గంజాయి మత్తులో ఉండటం వల్ల ఎస్ ఐ వెంకటాద్రి సహా పోలీస్ సిబ్బంది మౌనంగా ఉన్నారు.
శ్రీకాళహస్తి నగరంలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న లంకమిట్ట గిరిజన కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. లంకమిట్ట గిరిజన కాలనీలో ప్లాస్టిక్ వస్తువులు సేకరించి బ్రతుకు సాగిస్తున్న ఇద్దరు వృద్ధులు గుడిలో నివసిస్తున్నారు. వయోభారంతో పూర్తిగా లేవలేని స్థితికి రావడం.. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతుండటంతో మంచానికే పరిమితం అయ్యారు..మంగళవారం తెల్లవారుజామున తీవ్ర చలికి తట్టుకోలేక చలి మంట వేసుకున్న వృద్ధులకు గుడిసెలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా అంటుకోవడంతో మంటలు చెలరేగి వృద్ధులు అగ్నికి ఆహుతి అయ్యారు.. ఈ ఘటనలో 80 ఏళ్ల వెంకటసుబ్బయ్య 75 ఏళ్ల లక్ష్మమ్మ పూర్తిగా సజీవదహనమయ్యారు.
కామారెడ్డి జిల్లాలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో హనుమండ్ల సాత్విక అనే 17 ఏళ్ల బాలిక చున్నీతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశువుల కొట్టంలో పని చేయకపోవడంతో సాత్వికను తండ్రి ఎల్లయ్య ఇంట్లో బంధించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది.
సూర్యజయంతి వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సాగుతున్నాయి. రథసప్తమి వేడుకలలో భాగంగా ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. ఇక కోవిడ్ కారణంగా ఈ ఏడాది రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహిస్తుంది టీటీడీ.
- తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలోని వ్యవసాయ క్షేత్రంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవసాయ పనులు
- ధర్మవరంలో కౌలుకు తీసుకున్న భూమిలో ట్రాక్టర్ తో దుక్కి దున్నిన లక్ష్మీనారాయణ
- వ్యవసాయ భూముల్లో అపరాల సాగు నిమిత్తం పెసలు, మినుములు పంట విత్తనాలు జల్లిన సీబీఐ మాజీ జేడీ
- లక్ష్మీనారాయణ వెంట స్థానిక నాయకులు ఓంశాంతి సభ్యులు
మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పూల వ్యాపారులు మృతి చెందారు. తూప్రాన్ నుండి గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు కారులో వెళ్తుండగా అతి వేగంతో ముందు వెళ్తున్న మరో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీవారు. సూర్య జయంతిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. రథసప్తమి వేడుకల్లో ప్రధమ వాహనంగా సూర్య నారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలూ పేర్కొంటున్నాయి. కోవిడ్ ధర్డ్ వేవ్ నేపధ్యంలో తిరుమలలో రథసప్తమి వేడుకలను ఏకాంతంగా టిటిడి నిర్వహిస్తుంది. రధసప్తమి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో నిర్వహించే వర్చువల్ ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహ్రదీపాలంకర సేవలను టిటిడి రద్దు చేసింది.
పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ వేకువజామున తారు లోడ్డుతో వెళ్తున్న టిప్పర్ లారీ సుమోను ఢీ కొనడంతో సుమోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుమోలో ఉన్న వ్యక్తి మంటలకు సజీవదహనం అయ్యాడు. పలమనేరు - కుప్పం జాతీయ రహదారిలోని దొడ్ల డైరీ సమీపంలో ఘటన జరిగింది.. స్ధానికుల సమాచారంతో ఘటన స్ధలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు..మంటల్లో సజీవ దహనంమైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Background
తెలంగాణలో చలి ఓ మోస్తరుగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చలి తీవ్రత అలాగే ఉంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉంది.
ఈశాన్య, ఉత్తర దిశ నుంచి వీచే గాలులతో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో చలి ఎక్కువగా ఉంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. కళింగపట్నంలో 16.4 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 17.6 డిగ్రీలు, నందిగామలో 17.5 డిగ్రీలు, బాపట్లలో 18.2, అమరావతిలో 18.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం సాధారణంగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు. కోస్తాంధ్రతో పోల్చితే చలి తీవ్రత మాత్రం ఇక్కడ చాలా వరకు తగ్గినట్లు వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,200 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,300 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.64,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,900 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,200 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,300గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,900గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -