ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 39,848 మంది నమూనాలు పరీక్షించగా 385 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మరణించారని తెలిపింది. కరోనా నుంచి 675 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,355 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కోవిడ్‌ వల్ల చిత్తూరు, కృష్ణా, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని పేర్కొంది. 


Also Read: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,66,450కి చేరింది. వీరిలో 20,47,722 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 675 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,355 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,373కు చేరింది. 


Also Read:  'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'


తెలంగాణలో 121 కరోనా కేసులు


తెలంగాణలో గత 24 గంటల్లో 25,021 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 121 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,71,463కు  చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,956కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 183 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 4,009 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసులు 15వేల కన్నా తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదు కాగా 446 మంది మరణించారు. 14,667 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.20%గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.46%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. 




    • మొత్తం కేసుల సంఖ్య: 3,42,73,300

    • యాక్టివ్ కేసులు: 1,59,272

    • మొత్తం రికవరీలు: 3,36,55,842

    • మొత్తం మరణాలు: 4,58,186

    • మొత్తం వ్యాక్సినేషన్: 1,06,14,40,335







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి