ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 29,263 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 159 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,444కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 169 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,670 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,138 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,252కి చేరింది. గడచిన 24 గంటల్లో 169 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,444కు చేరింది. 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


దేశంలో ఒమిక్రాన్ కేసులు


దేశంలోకి ఒమిక్రాన్ ఏంట్రీ ఇచ్చింది. బెంగళూరులోనే రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జినోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. దేశంలో మరింత ప్రబలే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి జినోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ నిర్ధారణైంది. ఒమిక్రాన్ సోకిన వారిలో ఒకరికి 66 ఏళ్లు ఉండగా, మరొకరికి 46 ఏళ్లు ఉన్నట్లు సమాచారం.


ప్రధాని సమీక్ష..


ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్ర‌ధాని మోదీ అత్య‌వ‌స‌ర స‌మీక్ష నిర్వహించారు. ప్రస్తుత ప‌రిస్థితిని ప్ర‌ధానికి ఆరోగ్య‌శాఖ అధికారులు వివరించారు.


భయపడొద్దు..


ఒమ్రికాన్ వేరియంట్‌ కేసులు దేశంలో నమోదు కావడంతో తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఒమ్రికాన్ భయంతో ఆంక్షలు విధించాయి. ఇలాంటి వేళ ఒమిక్రాన్ వేరియంట్‌ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్‌ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్‌కే. ధీమాన్. 


Also Read: 'ఒమిక్రాన్‌'పై గుడ్‌ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి