హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో DILSEY ప్రోగ్రామ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ(సైబర్ క్రైమ్) కేవీఎం ప్రసాద్,  హెచ్‌సీఎస్‌సీ సైబర్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ సంతోష్ కావేటి, ప్రోఆర్చ్ వ్యవస్థాపకుడు, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ  భాను మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుందర్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. 


Also Read: ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..


క్రిప్టోకరెన్సీపై ప్రశ్నలు


ఏసీపీ ప్రసాద్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కొన్ని కేస్ స్టడీస్ ను విద్యార్థులకు వివరించారు. సైబర్ సెక్యూరిటీపై ఆయన యువతకు సలహాలు అందించారు. సైబర్ నేరాలకు ఎలా బాధితులు అవుతామో సైబర్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ సంతోష్ తెలిపారు. ఆయన విద్యార్థులకు DILSEY ప్రోగ్రామ్ గురించి వివరించారు.  సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ భానుమూర్తి తన అనుభవాన్ని విద్యార్థులకు తెలియజేశారు. డిజిటల్ విధానాలు, సైబర్ నేరాలపై మాట్లాడారు. ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించారు. సెషన్ తర్వాత విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు చెప్పారు. అలాగే క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ మరెన్నో విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. 


Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?


దిల్ సే ప్రోగ్రామ్


సైబరాబాద్ పోలీసులు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సహకారంతో విద్యార్థులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించేందుకు, సైబర్ నేరాలను అరికట్టేందుకు డిజిటల్ అక్షరాస్యత (DiLSeY) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. కళాశాలలు, పాఠశాలలు ఇతర ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. DiLSey వాలంటీర్ అవ్వడానికి ఆసక్తి ఉన్నవారు crm@scsc.in మెయిల్ చేయవచ్చు. 


Also Read:  కాల్ సెంటర్ పెట్టారు.. కోట్లు దోచారు ! అతి పెద్ద మోసగాళ్ల ముఠాను పట్టేసిన సైబరాబాద్ పోలీసులు...


Also Read: సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పై విద్యార్థుల క్వశ్చన్స్..


Also Read: వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ... మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలం





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి