Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,213 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 141 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,725కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 1,329 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,299,362 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 3518 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,605 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,30,81,987 నిర్థారణ పరీక్షలు చేశారు. 










దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 11,499 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసులు ముందురోజుతో పోలిస్తే 12.6 శాతం మేర కేసులు తగ్గాయి. పాజిటివిటీ రేటు 1.01 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో మరణాలు కూడా 300 దిగువకు వచ్చింది. క్రితం రోజు మరణాల సంఖ్య 302గా ఉంది. ప్రస్తుతం ఆ సంఖ్య 255కి చేరింది. 2020 జనవరి నుంచి 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. 5,13,481 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,21,881కి తగ్గాయి. మొత్తం కరోనా కేసుల్లో బాధితులు 0.28 శాతంగా ఉన్నారు. దేశంలో రికవరీ రేటు 98.52 శాతానికి పెరిగింది. శుక్రవారం కరోనా నుంచి 23,598 మంది కోలుకోగా మొత్తం రికవరీలు 4.22 కోట్లు దాటాయి. నిన్న 28 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. 13 నెలల వ్యవధిలో 177 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.