ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,737 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో 1,179 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,40,708 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ వల్ల 11 మంది చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,089కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,651 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,12,714కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 క్రియాశీలక కేసులున్నాయి. ఇప్పటివరకు 2,78,13,498 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 


Also Read: Pfizer Vaccine Clinical Trial: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త.. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు భేష్.. ఫైజర్ ప్రకటన






తెలంగాణలో కొత్త కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,505 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 244 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,63,906కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,907కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 296 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,55,061కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,938 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.



దేశంలో కోవిడ్ కేసులు


దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 184 రోజులుగా నమోదవుతోన్న కోవిడ్ కేసుల్లో ఇవే అత్యల్పం కావడం విశేషం. కొత్తగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,35,04,534కి చేరింది. దేశంలో నిన్న ఒక్క రోజే కోవిడ్ బారిన పడిన వారిలో 34,469 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,27,49,574కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కరోనా కారణంగా 252 మంది మరణించారు. దీంతో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,45,385కి పెరిగింది.


Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు


క్రియాశీల కేసులు తగ్గుముఖం


దేశంలో ఈరోజు నమోదైన కోవిడ్ కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో 3,09,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.75 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 0.92 శాతానికి తగ్గింది. కేరళలో నిన్న ఒక్క రోజే 15,692 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.


Also Read: India Covid Cases: దేశంలో తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. 184 రోజుల్లో ఇదే అత్యల్పం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి