ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,267 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 615 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో నలుగురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,702కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,787 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,86,575 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 12,550 యాక్టివ్‌ కేసులు(Active Cases) ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,13,827కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,69,245 నిర్థారణ పరీక్షలు చేశారు. 






దేశంలో కరోనా కేసులు 


దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 30 వేలకు దిగువనే కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజులో 27,409 కేసులు వచ్చాయి. 82,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 347 మంది కరోనాతో మృతి చెందారు. డైలీ పాజిటివిటీ రేటు 2.23%గా ఉంది.



  • యాక్టివ్ కేసులు: 4,23,127

  • డైలీ పాజిటివిటీ రేటు: 2.23%




  • మొత్తం రికవరీలు: 4,17,60,458




  • మొత్తం వ్యాక్సినేషన్: 173.42 కోట్ల డోసులు 


వ్యాక్సినేషన్






దేశంలో సోమవారం 44,68,365 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1,73,42,62,440 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


మహారాష్ట్ర 


మహారాష్ట్రలో కొత్తగా 1,966 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,44,915కు చేరింది.


కేరళ



  • కేరళలో కూడా కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఒక్కరోజులో 8,989 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 178 మంది మృతి చెందారు.

  • కర్ణాటకలోనూ కేసులు తగ్గాయి. కొత్తగా 1,568 మందికి వైరస్ సోకింది. మహమ్మారి కారణంగా మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • దిల్లీలో తాజాగా 586 కేసులు నమోదు అయ్యాయి.