ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15,193 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 434 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,698కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 4,636 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,83,788 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 14,726 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,13,212కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,46,978 నిర్థారణ పరీక్షలు చేశారు.
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ(Night Curfew) ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినా కరోనా ఆంక్షలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్(Mask)లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఒకవేళ పెట్టుకోకపోతే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాపింగ్ మాల్స్(Shopping Malls), బహిరంగ ప్రదేశ్లాల్లో కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే(Fever Survey) కొనసాగించాలని సూచించింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షల చేయాలని ఆదేశించింది. వైద్య ఆరోగ్య శాఖ(Health Department)లో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో కొత్తగా 614 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,520 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కొత్తగా 614 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,84,062కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్(Corona Bulletin) విడుదల చేసింది. ఆదివారం కరోనా మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,107కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,387 మంది కోలుకున్నారని వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,908 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 34,113 కరోనా కేసులు నమోదుకాగా 346 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 3.19%గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 4,78,882 (1.12%)
- మొత్తం రికవరీలు: 4,16,77,641
- మొత్తం మరణాలు: 5,09,011
- మొత్తం వ్యాక్సినేషన్: 1,72,95,87,490
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 11,66,993 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,95,87,490 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.