ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,768 మంది శాంపిల్స్ పరీక్షించగా 320 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో ఐదుగురు మృతి చెందారు. కరోనా నుంచి శనివారం 425 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,458 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యా ఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కోవిడ్‌ వల్ల గుంటూరులో ఇద్దరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో  ఒకరు చొప్పున మృతి చెందారు. 






Also Read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,68,241కి చేరింది. వీరిలో 20,50,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 425 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,397కు చేరింది. 


దేశంలో కరోనా కేసులు


దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారిని దాదాపు కట్టడి చేయడంతో దాదాపు విజయాన్ని సాధించాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,853 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటి కేసులతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో 526 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. కరోనా మరణాలు నిన్నటి కంటే 25 శాతం అధికంగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. 


Also Read: దేశంలో 260 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు, కానీ ఆందోళన పెంచుతున్న కొవిడ్19 మరణాలు


జనవరిలో వ్యాక్సినేషన్ పంపిణీ మొదలైనప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,08,21,66,365 (108 కోట్ల 21 లక్షల 66 వేల 365) డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. నిన్న 12,432 మంది కరోనాను జయించగా.. మొత్తం రికవరీలు  3.37 కోట్లు దాటాయి. భారత్‌లో ప్రస్తుతం 1,44,845 (ఒక లక్షా 44 వేల 845) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 260 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 9,19,996 (9 లక్షల 19 వేల 996) శాంపిల్స్ పరీక్షించగా.. దాదాపు 11 వేల మందికి కొవిడ్19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు తాజా హెల్త్ బులెటిన్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు.


Also Read: ప్రపంచంలో ఎక్కువగా ఆరాధించే నాయకుల్లో ముందు వరుసలో మోడీ.. ఆ తర్వాతి స్థానాల్లో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి