ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,553 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 839 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,503కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 150 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,440 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 3659 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,80,602కి చేరింది. గడచిన 24 గంటల్లో 150 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 3659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,503కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,15,67,472 శాంపిల్స్ పరీక్షించారు.
Also Read: సీనియర్ సిటిజన్లకు జనవరి 10 నుంచి ప్రికాషన్ డోస్.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు
జనవరి 10 నుంచి ప్రీకానరీ డోస్
ఆరోగ్య, ఫ్రంట్ లైన్ కార్మికులతోపాటు 60 ఏళ్ల పైబడిన వారికి జనవరి 10 నుంచి ముందస్తు జాగ్రత్త.. టీకాలు వేయనున్నారు. ఇప్పటికే రెండు డోస్‌ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పొంది, బూస్టర్ డోస్‌కు అర్హులైన వారు కొత్త రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
Also Read: భారత్‌లో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు, ఒక్కరోజులో లక్షన్నర మందికి కోవిడ్.. 285 మంది మృతి
'కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్ డోసుకు అర్హులైనవారు.. ఈ డోసు కోసం మళ్లీ కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ప్రికాషనరీ డోసు టీకా షెడ్యూల్స్‌ను జనవరి 8న తెరుస్తాం. శనివారం సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం ఉంటుంది. జనవరి 10 నుంచి నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి కూడా టీకా కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.' ఆరోగ్య శాఖ తెలిపింది.