ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 15,568 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 122 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,498కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 103 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,832 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1278 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,608కి చేరింది. గడచిన 24 గంటల్లో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1278 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,498కు చేరింది. 


Also Read: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి


నెల్లూరులో టీనేజ్ వ్యాక్సినేషన్ ప్రారంభం


నెల్లూరు జిల్లాలో 15 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు లక్షా 41వేల మంది ఉన్నారని తెలిపారు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. నెల్లూరు జిల్లాలో టీనేజ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టీనేజ్ పిల్లలకు కొవాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నాలుగు రోజులుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఫస్ట్ డోస్ 100శాతం పూర్తయిందని, ఏపీలోనే నెల్లూరు అరుదైన రికార్డ్ సాధించిందని, టీనేజ్ వ్యాక్సిన్లో కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తామని అన్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు స్కూళ్లకు వెళ్లి టీనేజర్లకు వ్యాక్సిన్లు ఇచ్చారు. 


దేశంలో 33 వేల కరోనా కేసులు


దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా 33,750 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మొత్తం కేసుల సంఖ్య 1700 మార్కు దాటింది2. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది. కొత్తగా 50 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 



  • యాక్టివ్ కేసులు: 1,45,582

  • మొత్తం రికవరీలు: 3,42,95,407

  • మొత్తం మరణాలు: 4,81,893

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,45,68,89,306


Also Read: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి