ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 55,323 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1,246 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,44,490కు చేరుకుంది. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 14,118కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్‌ను విడుదల చేసింది. గడిచిన కరోనా వైరస్ నుంచి 1,450 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 20,16,837 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 14,118 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 2,79,80,792 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Also Read: వ్యాక్సినేషన్ లో భారత్ ప్రపంచ రికార్డు.. ప్రధాని మోడీకి బర్త్ డే గిఫ్ట్ గా 2.5 కోట్ల టీకాలు పంపీణీ
తెలంగాణలో 239 కొత్త కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 239 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,64,650లు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,911కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 336 మంది కోలుకున్నారు. వీరితో రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,55,961కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,778 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: ఇంటి వద్దే కరోనా వ్యాక్సిన్... త్వరలో పూర్తి కార్యాచరణ... కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి