ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ( AP Special Status ) హోంశాఖ చర్చిస్తుందని అధికారిక సమాచారం వచ్చిన గంటల్లోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( MP GVL Narasimha Rao ) అదంతా నిజం కాదని వీడియో ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రల్లో ఆర్దిక పరిస్దితులు, ప్రత్యేక హోదా అంశాల పై కేంద్ర హోం శాఖ వర్గాలు ( Central Home Mnisistry ) చర్చించేందుకు ఈ నెల 17న త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. అజెండా అంశాలు మీడియాలో విడుదల అయ్యాయి. దీంతో ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ( Central Governament ) పునరాలోచన చేస్తోందంటూ ప్రచారం ప్రారంభమయింది.
వచ్చే గురువారం ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చ - విభజన సమస్యలపై కేంద్రం కీలక నిర్ణయం !
కానీ ఈ విషయం పై బీజేపి నేతలు ఆరా తీశారు. అసలు ఆ అజెండా కాపీలు బయటకు ఎలా వచ్చాయి. అందులో అంశాలు పై ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉందన్న విషయాలను ఆరా తీశారు. ఆ తరువాత బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ప్రత్యేకంగా వీడియో ను విడుదల చేశారు. ఎపీకి హోదా పై చర్చ జరిగే అవకాశం లేదన్నారు. కేవలం ఆర్దిక పరమయిన విషయాలు పైనే చర్చ ఉంటుందని చెప్పారు. అంతే కాదు ఎపీని కేంద్రం ఆర్దికంగా అన్ని విధాలుగా ఉంటుందని హోదా పై చర్చ లేదన్నారు. ఇలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వవద్దని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసుల్ని బలిపశువులు చేస్తున్న జగన్ రెడ్డి - తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమన్న చంద్రబాబు !
17వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ( Telugu States ) మధ్య ఉన్న సమస్యలపైనే చర్చ జరుగుతుందని జీవీఎల్ నరసింహారావు చెబుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు ( YSRCP Leaders ) ఎదో సాధించారని అనుకున్నానని.. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అధికారులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాల్సిన అవసరం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
అయితే బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు స్పందించారు కానీ హోంశాఖ నుంచి అధికారికంగా విడుదలైన పత్రం ప్రకారం ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదా ఉంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ మళ్లీ సవరణ ప్రకటన చేస్తేనే ప్రత్యేకహోదా అంశంపై చర్చ లేదని అధికారికంగా అనుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై హోంశాఖ ఏమైనా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి !