ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Modi )విభజన సరిగ్గా చేయకపోవడం వల్లే తెలుగు  రాష్ట్రాలకు ( Telugu States ) ఇంకా సమస్యలు ఉన్నాయని పార్లమెంట్‌లో ప్రకటించిన కొద్ది రోజులకే సమస్యల పరిష్కారానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ 17వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల అధికారులతో పాటు కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో  విభజన సమస్యల పరిష్కారానికి  Telugu States Problems ) కమిటీ ఏర్పాటు చేశారు.  కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం గురువారం ఉదయం 11గంటలకు జరగనుంది. వర్చువల్‌గానే భేటీ జరుగుతుంది.


సమావేశంలో చర్చించడానికి మొత్తం ఎనిమిది అంశాలను ఎజెండాగా ఖరారు చేశారు.  మొదటి అంశం ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన ఆ తర్వాత వరుసగా విద్యుత్ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు,  విద్యుత్ సంస్థల్లో  నగదు అంశం, వనరుల సర్దుబాటు, వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం, ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, వనరుల వ్యత్యాసం వంటి వాటిపై చర్చిస్తారు. అలాగే విభజన చట్టం షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించే అవకాశం ఉంది.  ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.


మిగతా అంశాల సంగతి పక్కన పెడితే రాజకీయంగా ఎంతో కీలకమైన ప్రత్యేకహోదా ( special Status ) అంశంపైనా చర్చిస్తామని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పెట్టడం ఏపీ ప్రభుత్వానికి ఊరటక కలిగిస్తోంది. హోదా అనేది ముగిసిన అధ్యాయం అని అంటూ కేంద్రం లోని పెద్ద‌లు ( Central Governament ) అనేక సార్లు తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్రమే ప్రత్యేకహోదాపై చర్చలకు రావాలని ఇరు రాష్ట్రల‌కు ఆహ్వ‌నం పంపింది. దీంతో ఈవిష‌యం పై మ‌రో సారి చ‌ర్చ కు తెర‌లేచింది.


వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు (YSRCP MPS ) ఇటీవలే ప్రధాని నరేం‍ద్రమోదీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా కోరారు. ఈ పరిణామాలతో సమస్యలు పరిష్కారానికి కేంద్రం  ముందుడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభఉత్వం ఆ అంశాలపై వినతి పత్రాలు ఇచ్చింది కాబట్టి చర్చించేందుకు ఎజెండాలో పెట్టారని కానీ ఎలాంటి ముందడుగు ఉండదని కొంత మంది అంచనా వేస్తున్నారు.