న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మందుబాబులు పాత రికార్డులు చెరిపేస్తూ.. మద్యం కొనుగోలులో కొత్త రికార్డులు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 31న ఒక్క రోజే రూ.124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఏపీలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయని రాష్ట్ర ఆబ్కారీ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవాకం ఒక్క రోజే రూ.124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని పేర్కొంది. మద్యం దుకాణాలు, బార్లలో విక్రయ సమయాన్ని గంటపాటు పొడిగించడంతో పాటు ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకురావడంతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని తెలిపింది. 1,36,124 కేసుల మద్యం, 53,482 కేసుల బీర్లు అమ్ముడయినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. 


Also Read:  కొత్త సంవత్సరంలో పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. మళ్లీ దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ.. 


రెండు రోజుల్లో రూ.215 కోట్ల విక్రయాలు


ఏపీలో ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రావడం, మద్యం ధరలు తగ్గడంతో నిన్న అమ్మకాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల్లో ఏపీలో సుమారు రూ.75 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.124 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే మందుబాబులు ఎంత టాక్స్ పే చేశారో అర్థం చేసుకోవచ్చు. అంటే సాధారణ రోజులతో పోలిస్తే రూ.50 కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 30వ తేదీన రూ. 121 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో 30, 31వ తేదీల్లో రూ. 215 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. అందుబాటులో ఉన్న మద్యం మొత్తాన్ని ఖాళీ చేశారు మందుబాబులు. చివరకు కొన్ని షాపుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. మొత్తానికి కొత్త ఏడాది ఏపీ ఖజానాకు కాసులు కురిపించింది. 


Also Read: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!


తెలంగాణలో  


తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంంలో రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్‌, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. కొనుగోళ్లలో అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26 కోట్లు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రూ.24.78 కోట్లు, హైదరాబాద్‌లో రూ.23.13 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబరు నెలలో రికార్డు స్థాయిలో రూ.3,459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సై్జ్ అధికారులు ప్రకటించారు. డిసెంబరులో 40.48 లక్షల కేసుల మద్యం, 34 లక్షలకు పైగా కేసుల బీర్లు కొనుగోళ్లు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా 2021 ఏడాదిలో రూ.30,222 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. 


Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి