ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 78,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 3,396 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 9 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,655కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో  13,005 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,07,364 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 78,746 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,00,765కి చేరింది. గడిచిన 24 గంటల్లో 13,005 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 78,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,655కు చేరింది. 


దేశంలో కరోనా కేసులు


 భారత్​లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,27,952 (1 లక్షా 27 వేల 952) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ మరో వెయ్యి మంది మరణించారు. వరుసగా అయిదోరోజు కరోనా మరణాలు వెయ్యి దాటడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం ఒక్కరోజు దేశంలో 1059 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది. తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,01,114 (5 లక్షల 1 వెయ్యి 114)కు చేరింది. నిన్న ఒక్కరోజులో 2,30,814 (2 లక్షల 30 వేల 814) మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 13,31,648 (13 లక్షల 31 వేల 648) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 7.98కి దిగొచ్చింది.  





వ్యాక్సినేషన్ వేగవంతం




భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 168.98 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం డోసులు 168 కోట్ల 98 లక్షల 17 వేల 199 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద దాదాపు 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా నేటి ఉదయం వరకు 39.05 కోట్ల మందికి కొవిడ్ సోకగా.. 57.2 లక్షల మంది వైరస్ తో పోరాడుతూ మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు దాదాపు 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.