తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ 'సకల గుణాభిరామ' అనే సినిమాలో నటించాడు. శుక్రవారం నాడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెస్ట్ లుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో సన్నీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.


గెస్ట్ గా వచ్చిన సోహెల్ ను ఉద్దేశిస్తూ.. 'బిగ్ బాస్ నాల్గో సీజన్ లో సోహెల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.. కానీ వీడు మాత్రం డబ్బులు తీసుకొని వచ్చేశాడు.. నేను కూడా అలానే చేస్తానని అందరూ అనుకున్నారు. నీకంటే(సోహెల్ కంటే) పది లక్షలు ఎక్కువే పెట్టారు. అయినా సరే టెంప్ట్ అవ్వలేదు. కళావతి(సన్నీ తల్లి)కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా అంటూ గర్వంగా చెప్పుకున్నాడు. 


సన్నీ ఇలా మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. స్టేజ్ పై అందరి ముందు సోహెల్ ని అవమానించినట్లుగా మాట్లాడాడని సన్నీని తిట్టిపోస్తున్నారు. సోహెల్ స్నేహితుడు, బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ అఖిల్ సైతం  సీరియస్ అయ్యాడు. ఈ కామెంట్స్ పై పరోక్షంగా స్పందిస్తూ.. తన ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టాడు. 


'మీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఒకరిని గెస్ట్ గా పిలిచినప్పుడు వారిని గౌరవించండి అంతేకానీ అవమానించకూడదు. మనం హీరో అవ్వడానికి పక్కవాళ్లను జీరో చేయొద్దు బ్రదర్. నా స్నేహితుడిని స్టేజ్ పై అలాంటి పరిస్థితుల్లో చూడడం నిజంగా బాధనిపించింది. నేను అక్కడ ఉంటే బావుండేది' అంటూ రాసుకొచ్చాడు. అయితే స్టేటస్ పెట్టిన కాసేపటికే అఖిల్ డిలీట్ చేశాడు. కానీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.