ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 30,578 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 4,605 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 10 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,641కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 11,729 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,85,042 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 93,488 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,93,171కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 93,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,641కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,25,71,365 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గినట్లు కనిపిస్తున్నా కేసులు నేడు పెరిగాయి. నిన్నటితో పోల్చితే 6.8 శాతం పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,72,433 (1 లక్షా 72 వేల 433) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ మరో వెయ్యి మంది మరణించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,008 మంది చనిపోయారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4,98,983కు చేరింది. నిన్న ఒక్కరోజులో 2,59,107 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921కు తగ్గింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు మళ్లీ 10 దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 అయింది.
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 167.87 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద ఇంకా 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నేటి ఉదయం వరకు 38.44 కోట్ల మంది కరోనా బాధితులుగా మారారు. 56.9 లక్షల మంది మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 101 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.